రజినీ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందన వైరల్..

అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని, దానికి రజినీకాంత్, లయ వంటి వారి వ్యాఖ్యలే నిదర్శనం అన్నారు కేటీఆర్.

Advertisement
Update:2023-05-09 23:07 IST

ఆమధ్య విజయవాడలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సినీ హీరో రజినీకాంత్ హైదరాబాద్ అభివృద్ధి గురించి, ఏపీ రాజకీయాల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఆ తర్వాత ఆయన వ్యాఖ్యలపై వైసీపీ నేతల కౌంటర్లు కూడా అంతే వైరల్ అయ్యాయి. అప్పట్లో తెలంగాణ మంత్రి హరీష్ రావు కూడా రజినీకాంత్ వ్యాఖ్యలపై పాజిటివ్ గా స్పందించారు. తాజాగా మంత్రి కేటీఆర్ మరోసారి రజినీ వ్యాఖ్యలను గుర్తు చేశారు. తమిళనాడు సూపర్ స్టార్ రజినీ కాంత్ హైదరాబాద్ గురించి గొప్పగా చెప్పారని, వారికి కూడా ఇక్కడి అభివృద్ధి కనపడుతోందని, కానీ స్థానికంగా ఉండే కొంతమందికి అర్థం కావడంలేదని విపక్షాలపై సెటైర్లు వేశారు.

రజినీకాంత్ తోపాటు, సినీ నటి లయ కూడా హైదరాబాద్ ని చూస్తే విదేశాల్లో ఉన్నట్టుగా ఉందని చెప్పారని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని, దానికి రజినీకాంత్, లయ వంటి వారి వ్యాఖ్యలే నిదర్శనం అన్నారు కేటీఆర్.


రజినీ కాంత్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందన వైరల్ గా మారింది. రజినీ మాటల్ని వైసీపీ నాయకులు పూర్తిగా విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు మాత్రం స్వాగతిస్తున్నారు. మొత్తమ్మీద రజినీకాంత్ చాలాకాలం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హాట్ టాపిక్ గా మారారు. రోజులు గడుస్తున్నా.. ఆయన వ్యాఖ్యలు ఏదో రకంగా మళ్లీ మళ్లీ తెరపైకి వస్తున్నాయి. 

Tags:    
Advertisement

Similar News