రైతులకు అండగా ఉంటాం.. మంత్రి కేటీఆర్ హామీ

ఇటీవల కురిసిన అకాల వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.

Advertisement
Update:2023-04-26 12:28 IST

అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు తమ ప్రభుత్వం బాసటగా ఉంటుందని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్. కష్ట కాలంలో రైతులకు అండగా ఉంటామని చెప్పారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా రైతులకు భరోసా ఇవ్వాలని కోరారు. క్షేత్రస్థాయిలో పర్యటించి స్ధానిక అధికారులను సమన్వయం చేసుకుంటూ పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు.

రాష్ట్రంలోని రైతులు ఆందోళన చెందవద్దని, రైతుల విషయంలో అత్యంత సానుకూలంగా ఉండే ప్రభుత్వం తెలంగాణలో ఉందని, ఏ ఒక్క రైతు ధైర్యం కోల్పోవద్దని, వారికి అండగా సీఎం కేసీఆర్ ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు కేటీఆర్.

ఇటీవల కురిసిన అకాల వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు భారీగా పంట నష్టం జరిగిందనే సమాచారం ఉందని, రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. మరో రెండు రోజులపాటు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్.

సిరిసిల్లలో నియోజకవర్గ బీఆర్ఎస్ ప్లీనరీలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. అకాల వర్షాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ తోపాటు ఎస్పీ, వ్యవసాయ అధికారులతో ఫోన్‌ లో మాట్లాడారు. జిల్లాలోని పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన జిల్లా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి రైతులకు భరోసా ఇవ్వాలని సూచించారు.

Tags:    
Advertisement

Similar News