తొడగొట్టారు, మెడ కోసుకుంటామన్నారు, రాజకీయ సన్యాసం అన్నారు..

బీజేపీ, కాంగ్రెస్ నేతలకు లొల్లి ఎక్కువ పని తక్కువ అని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. దున్నపోతు ఈనిందని ఒకరంటే, జున్నుపాలు ఏవని ఇంకొకరు అంటారని కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ, మోదీ.. అందరూ ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు.

Advertisement
Update:2023-11-13 15:09 IST

సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులని అన్నారు మంత్రి కేటీఆర్. మంత్రి, స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్.. వ్యక్తిగత పనులకోసం ఎప్పుడూ తనని ఏదీ అడగలేదని, కేవలం నియోజకవర్గ పనులకోసమే ఆయన తన దగ్గరకు వచ్చేవారని చెప్పారు. సనత్ నగర్ నియోజకవర్గంలో ఈసారి ఆయన గెలుపు గ్యారెంటీ అన్నారు. ప్రతి రోజూ ఆయన బస్తీల్లో తిరుగుతారని, ప్రజలను కలుస్తారని చెప్పారు కేటీఆర్.


లొల్లి ఎక్కువ, పని తక్కువ..

బీజేపీ, కాంగ్రెస్ నేతలకు లొల్లి ఎక్కువ పని తక్కువ అని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. దున్నపోతు ఈనిందని ఒకరంటే, జున్నుపాలు ఏవని ఇంకొకరు అంటారని కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ, మోదీ.. అందరూ ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేశారన్నారు. ఆ ప్రచారాలను అడ్డుకోవాలని కార్యకర్తలకు, బూత్ లెవల్ నాయకులకు పిలుపునిచ్చారు. కాలనీలు, అపార్ట్ మెంట్లు ఉన్న చోట, అర్బన్ ఓటర్లను కదిలించి పోలింగ్ కి వచ్చేలా చేయాలన్నారు కేటీఆర్.

బూత్ లెవల్ నాయకులు ప్రతి ఇంటికీ ఒకటికి నాలుగుసార్లు వెళ్లాలని, ఓట్లు అభ్యర్థించాలని చెప్పారు కేటీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలన్నారు. లబ్ధిదారులతో మాట్లాడాలని సూచించారు. సనత్ నగర్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ అభివృద్ధి చేశామన్నారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావాలని కేవలం పార్టీ నేతలే కోరుకోవడంలేదని, ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.

తొడగొట్టినోళ్లు, మెడకోసుకుంటామన్నోళ్లు, ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటామన్నోళ్లు.. చాలామంది ఉంటారని చెప్పారు మంత్రి కేటీఆర్. వాళ్లంతా కేసీఆర్ పని అయిపోయిందని, బీఆర్ఎస్ ఓడిపోతుందని మళ్లీ పెడబొబ్బలు పెడుతున్నారని, అలాంటివి ఏవీ నమ్మొద్దని సూచించారు. గతంలో పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ గెలిస్తేనే గడ్డం తీస్తా అన్నారని, ఇప్పటికీ ఆయన గడ్డానికి రంగులేసుకుని తిరుగుతున్నాడని.. అలాంటి వారి మాటల్ని ఎవరూ పట్టించుకోవద్దన్నారు కేటీఆర్.

Tags:    
Advertisement

Similar News