నాటుకోడి కూర చేసిన కేటీఆర్..

గంగవ్వ షో లో.. బీఆర్ఎస్ మేనిఫెస్టోని కూడా పూర్తి స్థాయిలో వివరించారు మంత్రి కేటీఆర్. ప్రతి రేషన్ కార్డుకి సన్నబియ్యం ఇస్తామని, విద్యార్థులకు టిఫిన్, భోజనం పెడుతున్నామని చెప్పారు. వండిపెట్టడం, మూతి తుడవడం మినహా ప్రతీదీ ప్రభుత్వమే చేస్తుందని సరదాగా వ్యాఖ్యానించారు.

Advertisement
Update:2023-11-04 21:58 IST

కేటీఆరా మజాకా..? ఎన్నికల టైమ్ లో ఓ వైపు ప్రచారంలో బిజీగా ఉంటూ, చేరికలతో వ్యూహాలు రచిస్తూ, మరోవైపు తనదైన స్టైల్ లో మై విలేజ్ షో లో పాల్గొన్నారు. కేటీఆర్ ఎపిసోడ్ కేవలం మూడు గంటల్లోనే 2లక్షల వ్యూస్ సాధించడం విశేషం. 42.38నిమిషాల పాటు ఈ షో నాన్ స్టాప్ హంగామాగా కొనసాగింది.

గతంలో గంగవ్వను కలసినప్పుడు ఆమె షో కి వస్తానని మాటిచ్చారట కేటీఆర్. ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నానని చెప్పారు. పొలాల్లో షూటింగ్ జరిగింది. టమోటాలు కోయడం దగ్గర్నుంచి మొదలు పెట్టి.. కేటీఆరే స్వయంగా కోడికూర వండారు. ఈ షో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. కేటీఆర్ అమెరికాలో ఉద్యోగం చేసేదగ్గర్నుంచి మొదలు పెట్టి చాలా విషయాలను గంగవ్వ షో ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు.


Full View

ప్రభుత్వ ఉద్యోగాల గురించి..

145 కోట్ల భారత దేశంలో 59 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయని, అందరికీ ఉద్యోగాలు రావు కదా అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 8నుంచి 10లక్షల ఉద్యోగాలు ఉంటాయని, రిటైర్ అయిన వారి స్థానాల్లో కొత్తవారిని భర్తీ చేస్తుంటామని.. ఉద్యోగాలు కావాల్సినోళ్లు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటారని వివరించారు. అందుకే ప్రభుత్వాలు.. ప్రైవేటు రంగంలో పెట్టుబడులు ఎక్కువగా తేవాలని ప్రయత్నిస్తుంటాయని, ఫాక్స్ కాన్ అనే ఒక్క పెద్ద కంపెనీతో తెలంగాణలో లక్ష ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పారు కేటీఆర్.

రైతుబంధుపై కీలక వ్యాఖ్యలు..

రైతుబంధు విషయంలో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ ఎకరాలున్నవారికి ఎక్కువ సాయం, తక్కువ సాగుభూమి ఉన్నవారికి తక్కువ సాయం అందుతోందని.. కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నీటి సౌలభ్యం పెరిగి, కరెంటు కష్టాలు తీరిపోయిన తర్వాత తెలంగాణ నుంచి వలసలు తగ్గిపోయాయని, ఇది శుభపరిణామం అన్నారు కేటీఆర్.

గంగవ్వ షో లో.. బీఆర్ఎస్ మేనిఫెస్టోని కూడా పూర్తి స్థాయిలో వివరించారు మంత్రి కేటీఆర్. ప్రతి రేషన్ కార్డుకి సన్నబియ్యం ఇస్తామని, విద్యార్థులకు టిఫిన్, భోజనం పెడుతున్నామని చెప్పారు. వండిపెట్టడం, మూతి తుడవడం మినహా ప్రతీదీ ప్రభుత్వమే చేస్తుందని సరదాగా వ్యాఖ్యానించారు. మొత్తమ్మీద ఈ షో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణ ఇంటర్వ్యూలాగా కాకుండా ఈ షో ఆసక్తికరంగా సాగింది. 

Tags:    
Advertisement

Similar News