సీఎం కేసీఆర్ హెల్త్‌పై కేటీఆర్ అప్డేట్.. కోలుకోవడానికి మరింత సమయం!
సీఎం కేసీఆర్ ఛాతీలో కొంత ఇన్ఫెక్షన్ ఉందని, కోలుకోవడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతుందన్నారు కేటీఆర్.
సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై కీలక అప్డేట్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ బ్యాక్టిరీయల్ ఇన్ఫెక్షన్ బారిన పడ్డారని చెప్పారు. వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గాక బ్యాక్టిరీయల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందన్నారు. సీఎం కేసీఆర్ ఛాతీలో కొంత ఇన్ఫెక్షన్ ఉందని, కోలుకోవడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతుందన్నారు కేటీఆర్. త్వరలోనే కేసీఆర్ కోలుకుని ప్రజల మధ్యకు వస్తారని చెప్పారు.
ఇక క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నప్పటికీ.. గెలుపు బీఆర్ఎస్‌దేనన్నారు. అభ్యర్థుల ప్రకటనలోనూ.. ఎన్నికల ఫలితాలలోనూ బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆరే బీఆర్ఎస్ ట్రంప్ కార్డ్ అని చెప్పారు. నేషనల్ మీడియా రిపోర్టర్‌తో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు కేటీఆర్.
సీఎం కేసీఆర్ వైరల్ ఫీవర్ కారణంగా ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రజలకు 3 వారాలుగా దూరంగా ఉంటున్నారు. సీఎం కేసీఆర్ వైరల్ ఫీవర్‌తో బాధ పడుతున్నారని, ప్రగతి భవన్‌లో ఐదుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోందని సెప్టెంబర్ 26న కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.