గిఫ్ట్ ఎ హోమ్.. కేటీఆర్ పుట్టినరోజున బంపర్ బొనాంజా
మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇంటిని నిర్మించినట్టు.. గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా బహూకరణ అని పేర్కొన్నారు. ఏకంగా ఇంటినే నిర్మించి ఇచ్చినందుకు రాజమ్మ సంతోషం వ్యక్తం చేశారు.
మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఎ స్మైల్ పేరుతో బీఆర్ఎస్ నాయకులు, ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు బహూకరించారు. ఆస్పత్రుల్లో పండ్లు, బ్రెడ్ లు పంచిపెట్టారు. రకరకాల సేవా కార్యక్రమాలతో ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. గిఫ్ట్ ఎ స్మైల్ కి తమదైన శైలిలో నిర్వచనమిచ్చారు. అయితే వీటన్నిటిలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇచ్చిన బహుమతి 'గిఫ్ట్ మోర్ స్మైల్'గా నిలిచింది. ఓ పేదరాలికి ఏకంగా ఇల్లు కట్టించి ఇచ్చారు చందర్.
అంతర్గాం మండలం గోలివాడ గ్రామంలో నిరుపేద మహిళ గాదెం రాజమ్మకు ఇంటిని నిర్మించి ఇచ్చారు ఎమ్మెల్యే చందర్. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఎమ్మెల్యే నిర్మించిన ఇంటిపై మంత్రి కేటీఆర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇంటిని నిర్మించినట్టు.. గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా బహూకరణ అని పేర్కొన్నారు. ఏకంగా ఇంటినే నిర్మించి ఇచ్చినందుకు రాజమ్మ సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ కి, ఎమ్మెల్యే చందర్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.