కక్ష.. వివక్ష.. కేంద్రంపై కేటీఆర్ ధ్వజం
అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టుగా కేంద్రం పరిస్థితి ఉందన్నారు మంత్రి కేటీఆర్. సాగు, తాగు నీటి ప్రాజెక్టుల కోసం కేంద్ర నిధులు ఇవ్వదని, తామే కట్టుకుంటామంటూ తెలంగాణ ముందుకొస్తే అనుమతులివ్వకుండా అడ్డుపడుతోందని విమర్శించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ రెండో దశకు కేంద్రం పర్యావరణ అనుమతి నిరాకరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు మంత్రి కేటీఆర్. ఇదేం న్యాయం? అంటూ ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణపై కక్ష, తెలంగాణ ప్రాజెక్ట్ లపై అంతులేని వివక్ష అంటూ మండిపడ్డారు.
అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టుగా కేంద్రం పరిస్థితి ఉందన్నారు మంత్రి కేటీఆర్. సాగు, తాగు నీటి ప్రాజెక్టుల కోసం కేంద్ర నిధులు ఇవ్వదని, తామే కట్టుకుంటామంటూ తెలంగాణ ముందుకొస్తే అనుమతులివ్వకుండా అడ్డుపడుతోందని విమర్శించారు. కృష్ణా జలాలపై 500 TMC తెలంగాణ హక్కుల సంగతి తేల్చడం లేదన్నారు. తెలంగాణ ప్రాజెక్ట్ ల విషయంలో అడుగడుగునా కొర్రీలు.. అంతులేని వేధింపులు! అంటూ మండిపడ్డారు కేటీఆర్.
పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరాలకి జాతీయ హోదా వద్దు.
మధ్యప్రదేశ్ ‘కెన్ బెట్వా’, కర్ణాటక ‘అప్పర్ భద్ర’ ముద్దు
ఒక్కో రాష్ట్రానికి ఒక్కో న్యాయం
తెలంగాణకు మాత్రం ఎల్లప్పుడూ అన్యాయం.
కేంద్ర బీజేపీ ప్రభుత్వ పక్షపాత ధోరణి పరాకాష్టకు చేరుతుంది.
తెలంగాణ ప్రజల సహనాన్ని పరీక్షిస్తోంది.
అంటూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను తన ట్వీట్ కు జతచేశారు.