అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేం - కోమటిరెడ్డి
ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీశాయి.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమన్నారు. జాబ్ మేళాలు నిర్వహించి ప్రైవేట్ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పారు.
ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఇచ్చిన హామీని దాట వేసే కుట్రలో భాగంగానే కోమటిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు.
ఇప్పటికే నిరుద్యోగ భృతి విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్ చేశారు.