ఇంటర్ విద్యార్ధుల మరణాలపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్

ఇంటర్ కాలేజీల్లో విద్యార్ధుల మరణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్ అయ్యారు.

Advertisement
Update:2024-12-03 19:56 IST

తెలంగాణలోని ఇంటర్ కాలేజీల్లో విద్యార్ధుల మరణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పది రోజుల్లో ముగ్గురు విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని మంత్రి అన్నారు. ర్యాంకుల పేరిట విద్యార్ధులను మానసిక ఒత్తిడికి గురిచేసే ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటమని ఆయన అన్నారు. ఇక విద్యార్ధులు సూసైడ్ చేసుకున్న కాలేజీల పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది అని తెలిపారు.అలాగే విద్యార్ధులు అధైర్యపడి క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకొని తల్లితండ్రులకు గర్భశోకం మిగిల్చవద్దని కోరిన మంత్రి.. ఇంటర్ విద్యార్ధులకు ఏదైన అత్యవసర సమస్య ఉంటే నా ఆఫీసు మొబైల్ నెంబర్ ను 8688007954 లేదా minister.randbc@gmail.com ఈమెయిల్ కు తెలియజేయండి అన్నారు. అలాగే చావు సమస్యకు అంతిమ పరిష్కారం కాదు – బ్రతికి సాధించాలని విద్యార్ధులకు మంత్రి పిలుపు ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News