ఇంటింటికి జోలె పట్టి చందాలు వసూలు చేయాలి - మంత్రి జూపల్లి

విద్యా వ్యాప్తి, చదువు కోసం గ్రామాల్లో వసూలైన చందా వివరాలు చెప్పిన తర్వాతే బీఫాంలు అడిగే అర్హత ఉంటుంద‌న్నారు.

Advertisement
Update:2024-02-08 10:56 IST

మంత్రి జూపల్లి కృష్ణారావు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి. స్థానిక ప్రజాప్రతినిధులు విద్యా వ్యాప్తి కోసం ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరిగి చందాలు వసూలు చేయాలన్నారు జూపల్లి.

ఎన్నిక‌ల‌కు ముందు ప్రతి ఇంటికి తిరిగి ఓట్లు ఎలా అడుగుతారో అలాగే జోలే పట్టుకుని ఇంటింటికి తిరిగి రూ.100కు తక్కువ కాకుండా చందా వసూలు చేయాలన్నారు. అలా చేస్తేనే ఆ ఊరికి ఏ పని కావాలన్న తాను చేసి పెడతానన్నారు మంత్రి. సర్పంచ్‌, ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎవరైనా ఈ పని చేయాల్సిందేనన్నారు.

విద్యా వ్యాప్తి, చదువు కోసం గ్రామాల్లో వసూలైన చందా వివరాలు చెప్పిన తర్వాతే బీఫాంలు అడిగే అర్హత ఉంటుంద‌న్నారు. మీరు వసూలు చేయకపోతే తానే స్వయంగా వచ్చి జోలె పట్టి ఇంటింటికి చందా వసూలు చేస్తానన్నారు జూపల్లి.

Tags:    
Advertisement

Similar News