మూడేళ్లుగా రాజగోపాల్ రెడ్డి బీజేపీకి కోవర్ట్..

మూడేళ్లుగా బీజేపీకి కోవర్టులా ఉన్నారని, కాంగ్రెస్ లో ఎదిగిన రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ పతనం అంచుకు చేరే సరికి ఇప్పుడు ప్లేటు ఫిరాయించారని మండిపడ్డారు మంత్రి జగదీష్ రెడ్డి.

Advertisement
Update:2022-09-03 08:23 IST

మునుగోడు ఉప ఎన్నిక వేళ.. ఇప్పటి వరకూ బీజేపీని టార్గెట్ చేసిన టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై ఫోకస్ పెట్టారు. రాజగోపాల్ రెడ్డి ఇన్నాళ్లూ మునుగోడుకి ఏం చేశారని నిలదీశారు. ఆయన మూడేళ్లుగా బీజేపీకి కోవర్టులా ఉన్నారని, కాంగ్రెస్ లో ఎదిగిన రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ పతనం అంచుకు చేరే సరికి ఇప్పుడు ప్లేటు ఫిరాయించారని మండిపడ్డారు మంత్రి జగదీష్ రెడ్డి. కాంట్రాక్టుల ఒప్పందం కుదరగానే తన ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని అన్నారు. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం చేశారు.

రాజగోపాల్ రెడ్డి సీన్ అయిపోయింది..

రాజకీయాల్లో రాజగోపాల్ రెడ్డి సీన్ అయిపోయిందని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. మునుగోడులో ఎగిరేది గులాబీ జెండానే అన్నారాయన. కాషాయం కనుచూపు మేరలో కూడా లేదని, టీఆర్ఎస్ తర్వాత రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంటుందని, బీజేపీకి మూడో స్థానమేనని తేల్చి చెప్పారు.. సర్వేల సారాంశం కూడా ఇదేనన్నారు జగదీష్ రెడ్డి.

నిధులివ్వలేదని అబద్ధాలు..

కోమటిరెడ్డి బ్రదర్స్ వి బ్రోకర్ మాటలు, బ్రోకర్ దందాలు అంటూ ఘాటుగా విమర్శించారు జగదీష్ రెడ్డి. అబద్దాలు చెప్పడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ను మించిన వాళ్లు లేరని ఎద్దేవా చేశారు. అన్ని నియోజకవర్గాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు సమానంగా ఇచ్చిందని చెప్పారు. నిధులివ్వడంలేదని రాజీనామా చేశానని, ఉప ఎన్నికతో నియోజకవర్గం అభివృద్ధి అవుతుందంటున్న రాజగోపాల్ రెడ్డి, తిరిగి కాంగ్రెస్ టికెట్ పైనే పోటీ చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. రాజకీయ స్వలాభంకోసం పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గర అభివృద్ధికోసం అంటూ కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. రాజగోపాల్ రెడ్డికి మూడో స్థానమే దిక్కు అని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News