వానల్లో వారి సేవలు అభినందనీయం.. హరీష్ రావు ట్వీట్

ప్రభుత్వ సిబ్బంది సేవలకు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ అత్యవసర సేవల సిబ్బందికి అభినందనలు అంటూ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు.

Advertisement
Update: 2023-07-28 09:08 GMT

అక్కడ వరద లేదు, కానీ వారు మాత్రం వరదని వెతుక్కుంటూ వెళ్లారు.

జోరు వానలో అందరూ ఇంటికే పరిమితమైన వేళ.. వారు రోడ్లపైకి వచ్చారు.

తమ కుటుంబం కంటే ఎక్కువగా బాధిత కుటుంబాలకు సమయం కేటాయించారు.

రోడ్లుబాగు చేశారు, ట్రాఫిక్ ని మళ్లించారు, ఆహారం అందించారు, వైద్యం చేశారు, ఆపదలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇవన్నీ చేస్తున్న పోలీస్, మున్సిపల్, పంచాయతీ, ఆరోగ్య, విపత్తు నిర్వహణ విభాగాల సిబ్బందిని మంత్రి హరీష్ రావు అభినందించారు. వారి సేవలను కొనియాడుతూ ట్వీట్ చేశారు.


తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలకు అవస్థలు తప్పలేదు. అదే సమయంలో వారికి సహాయం చేసేందుకు అధికార యంత్రాంగం, సిబ్బంది చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. రాత్రుళ్లు నిద్రకూడా లేకుండా కొంతమంది సిబ్బంది బాధితులున్న గ్రామాలను వెదుక్కుంటూ వెళ్లారు. ఎక్కడ ఏమూల ఏ ఒక్కరు వరదనీటిలో చిక్కుకున్నా, వారిని సురక్షితంగా తరలించే వరకు విశ్రమించలేదు. పోలీసులు, వైద్య సేవల సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది.. దాదాపు అన్ని విభాగాల ఉద్యోగులు.. వరదల్లో సెలవులు కూడా లేకుండా పనిచేశారు.

ప్రభుత్వ సిబ్బంది సేవలకు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ అత్యవసర సేవల సిబ్బందికి అభినందనలు అంటూ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. సహాయక చర్యల్లో నిమగ్నమై ప్రజలకు ఇబ్బంది కలగకుండా వారు చేస్తున్న సేవలు అమూల్యం అని అన్నారు. సీఎం కేసీఆర్ నిరంతర పర్యవేక్షణలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్న తీరు అభినందనీయం అన్నారాయన. వానలు తగ్గుముఖం పట్టే వరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి హరీష్ రావు. 

Tags:    
Advertisement

Similar News