కాలజ్ఞానంలో చెప్పనివి కూడా.. కేసీఆర్ హయాంలో జరుగుతున్నాయి

కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని, అది సీఎం సొంత నియోజకవర్గం అవుతుందని, పక్కనే ఉన్న ఎల్లారెడ్డి కూడా పోటీపడి అభివృద్ధి చెందుతుందని.. హైదరాబాద్-సికింద్రాబాద్ లాగా కామారెడ్డి-ఎల్లారెడ్డి జంట నగరాలుగా అభివృద్ధి చెందుతాయన్నారు హరీష్ రావు.

Advertisement
Update:2023-11-24 17:48 IST

బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పనివి కూడా కేసీఆర్ హయాంలో జరుగుతున్నాయని చెప్పారు మంత్రి హరీష్ రావు. సాగునీటికి ఎక్కడా కొరత లేదని, గతంలో కూలీలకు పని దొరికేది కాదని, ఇప్పుడు పొరుగు రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి ఇక్కడ పనిచేసి వెళ్తున్నారని చెప్పారు. చత్తీస్ ఘడ్ నుంచి మగ కూలీలు వచ్చి ఇక్కడ నాట్లు వేసి వెళ్తున్నారని, బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా మగవారు వచ్చి నాట్లు వేస్తారని చెప్పలేదని, కేసీఆర్ హయాంలో అది జరుగుతోందని వివరించారు. ఆ స్థాయిలో సాగు పెరిగిందని, వ్యవసాయం లాభసాటిగా మారిందన్నారు హరీష్ రావు. ఎల్లారెడ్డిలో సురేందర్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.


Full View

కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని, అది సీఎం సొంత నియోజకవర్గం అవుతుందని, పక్కనే ఉన్న ఎల్లారెడ్డి కూడా పోటీపడి అభివృద్ధి చెందుతుందని.. హైదరాబాద్-సికింద్రాబాద్ లాగా కామారెడ్డి-ఎల్లారెడ్డి జంట నగరాలుగా అభివృద్ధి చెందుతాయన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ కు పోటీగా నిలబడినవారి తరపున ఎవరో అమెరికా నుంచి వచ్చి సంతలో పశువుల్ని కొన్నట్టు నాయకుల్ని కొంటున్నారని, వారు నాయకుల్ని కొంటారేమో కానీ, ఎల్లారెడ్డి ప్రజల ఆత్మాభిమానాన్ని కొనలేరని అన్నారు. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గృహ నిర్మాణంపై దృష్టి పెడతామన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు కట్టించి ఇస్తామన్నారు హరీష్ రావు.

కర్నాటకలో 5 గ్యారెంటీలని ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ప్రజల్ని పట్టించుకోవట్లేదని విమర్శించారు హరీష్ రావు. కర్నాటక ప్రజలు ఇప్పుడు లబోదిబోమంటున్నారని గుర్తు చేశారు. బీజేపీ ఉన్నప్పుడయినా కరెంటు ఏడెనిమిది గంటలు సరఫరా అవుతుండేదని, కర్నాటకలో కాంగ్రెస్ వచ్చాక మూడు గంటలే ఇస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒక్కో రైతుకి 15 వేల రూపాయలు ఇస్తామంటోందని, కేసీఆర్ హ్యాట్రిక్ కొడితే ఒక్కో రైతుకి ఎకరానికి 16వేల చొప్పున ఆర్థిక సాయం అందుతుందని, మూడెకరాల రైతుకి 48వేల రూపాయల సాయం లభిస్తుందన్నారు హరీష్ రావు. ఈ తేడాని గ్రామాల్లో రైతులకు వివరించి చెప్పాలన్నారు.

Tags:    
Advertisement

Similar News