మంత్రి చేయలేని పని ఎమ్మెల్యే చేసి చూపించారు

కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతు భరోసా రూ.15వేలు ఇస్తామంటున్నారని.. మూడెకరాలున్న రైతుకు కూడా 15వేలే వస్తాయన్నారు మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చాక ఎకరానికి రూ.16వేలు రైతుబందు ఇస్తామని చెప్పారు. అంటే మూడెకరాల రైతుకి 48వేల రూపాయలు వస్తాయన్నారు. ఈ తేడా రైతులు గమనించాలన్నారు.

Advertisement
Update:2023-11-18 15:13 IST

మంత్రి చేయలేని పని ఎమ్మెల్యే చేసి చూపించారు

కాంగ్రెస్ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి కూడా సుదర్శన్ రెడ్డి చేయలేని పనుల్ని బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న షకీల్ పూర్తి చేశారని చెప్పారు మంత్రి హరీష్ రావు. బోధన్ లో బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్ కి మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. షకీల్ హయాంలో బోధన్ లో సాగునీటి పారుదల మెరుగైందన్నారు. రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు.


కర్నాటకలో ప్రజలు కాంగ్రెస్ పై విసుగెత్తిపోయారని విమర్శించారు హరీష్ రావు. కర్నాటకలో అరచేతిలో వైకుంఠం చూపించి, వారితో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు వారిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కర్నాటకలో రోజుకి 3 గంటలు కరెంటు ఇచ్చే కాంగ్రెస్.. తెలంగాణలో 24 గంటలు ఇస్తుందా అని ప్రశ్నించారు. మేనిఫెస్టోలో కొత్త కొత్త హామీలిచ్చి ప్రజల్ని మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. బోధన్ లో షకీల్ ని మూడోసారి గెలిపించాలని, కేసీఆర్ ని హ్యాట్రిక్ సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతు భరోసా రూ.15వేలు ఇస్తామంటున్నారని.. మూడెకరాలున్న రైతుకు కూడా 15వేలే వస్తాయన్నారు మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చాక ఎకరానికి రూ.16వేలు రైతుబందు ఇస్తామని చెప్పారు. అంటే మూడెకరాల రైతుకి 48వేల రూపాయలు వస్తాయన్నారు. ఈ తేడా రైతులు గమనించాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఎలాంటి సంబంధం లేదన్నారు. అదే నిజమైతే.. బీజేపీ నియమించిన గవర్నర్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి సహకరించేదే కదా అని ప్రశ్నించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో కూడా ఆమె ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడం లేదన్నారు హరీష్ రావు.

Tags:    
Advertisement

Similar News