కనీస వేతనాల చట్టం: రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు

తెలంగాణ ప్రాంతీయ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. 68వ‌ షెడ్యూల్డ్ ఉద్యోగుల కనీస వేతనాలు సుమారు 16 సంవత్సరాలుగా సవరించలేదని యూనియన్ కోర్టుకు ఫిర్యాదు చేసింది.

Advertisement
Update:2023-03-28 06:55 IST

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కనీస వేతనాల చట్టానికి సంబంధించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి, కార్మిక శాఖకు సోమవారం నోటీసులు జారీ చేసింది.

తెలంగాణ ప్రాంతీయ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. 68వ‌ షెడ్యూల్డ్ ఉద్యోగుల కనీస వేతనాలు సుమారు 16 సంవత్సరాలుగా సవరించలేదని యూనియన్ కోర్టుకు ఫిర్యాదు చేసింది.

5వ‌ షెడ్యూల్డ్ ఉద్యోగుల‌ వేతన సవరణ జరిగినప్పటికీ, భారత గెజిట్‌లో ప్రభుత్వ ఉత్తర్వులు ప్రచురించకపోవడంతో ఇప్పటి వరకు అవి అమలు జరగడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ స్పందన కోసం నోటీసులు జారీచేసిన ధర్మాసనం కేసును జూన్ 19కి వాయిదా వేసింది.

Tags:    
Advertisement

Similar News