కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే.. జరిగేది ఇదే..
ఇంటర్నెట్ కనెక్టివిటీలో దేశంలోనే తెలంగాణ ముందుందన్నారు అసదుద్దీన్. ఇక్కడి మౌలిక సదుపాయాలు, శాంతియుత వాతావరణం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు.
కాంగ్రెస్, బీజేపీ పాలనపై మరోసారి విరుచుకుపడ్డారు MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ట్విట్టర్ వేదికగా ఆ పార్టీల పాలనపై మండిపడ్డారు. తెలంగాణలో ఆ రెండు పార్టీలకు ఓటెయోద్దని పిలుపునిచ్చారు. ఆ రెండు పార్టీలకు ఓటెస్తే మళ్లీ మునుపటి రోజులు వస్తాయన్నారు.
ఇంటర్నెట్ కనెక్టివిటీలో దేశంలోనే తెలంగాణ ముందుందన్నారు అసదుద్దీన్. ఇక్కడి మౌలిక సదుపాయాలు, శాంతియుత వాతావరణం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికీ కర్ఫ్యూలు, ఇంటర్నెట్ బంద్ లాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఉపాధి కోసం బయటకు వెళ్లలేని పరిస్థితులు ఉంటాయన్నారు. ఇంటినుంచి కూడా పని చేయలేరంటూ ట్వీట్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అల్లర్లు, వెనుకబాటుతనానికి ఓటేసినట్లేనన్నారు. ఈ మేరకు ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇప్పటికే బీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించిన MIM.. తాము పోటీ లేని చోట బీఆర్ఎస్‌కు ఓటేయాలని ఓటర్లకు పిలుపునిచ్చింది. మూడోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని ఇప్పటికే ప్రకటించారు అసదుద్దీన్. ఇటీవల కాంగ్రెస్, రాహుల్, రేవంత్‌లను టార్గెట్ చేస్తూ విమర్శలు సైతం గుప్పించారు. కాంగ్రెస్ ముస్లిం వ్యతిరేక పార్టీ అని.. రేవంత్ RSSకు చెందిన వ్యక్తి అంటూ ఆరోపించారు.