ఓల్డ్‌ సిటీ లో అభివృద్ధిని అడ్డుకుంటున్న మజ్లిస్‌

మజ్లిస్‌ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పక్షపాతంగా వ్యవహరిస్తూ.. ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడిన కేంద్ర మంత్రి

Advertisement
Update:2024-11-10 16:17 IST

ఓల్డ్‌ సిటీ ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు అందకుండా మజ్లిస్‌ అన్యాయం చేస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. నాంపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేలుగా, కార్పొరేటర్లుగా మజ్లిస్ నేతలు ఏళ్ల తరబడి నేతృత్వం వహిస్తున్నారని గుర్తు చేశారు. మజ్లిస్‌ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పక్షపాతంగా వ్యవహరిస్తూ.. ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. డ్రైనేజీ సహా ఇతర అభివృద్ధి పనులు జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారని ధ్వజమెత్తారు. పార్లమెంటు సభ్యుడిగా నాంపల్లి ప్రజలకు న్యాయం చేసేలా అనేక అభివృద్ధి పనులు చేస్తున్నట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. 

Tags:    
Advertisement

Similar News