అటు శవయాత్రలు.. ఇటు పాలాభిషేకాలు

రుణమాఫీ విషయంలో రైతుల్లో వచ్చిన వ్యతిరేకతను తగ్గించి చూపేలా కాంగ్రెస్ అనుకూల సోషల్ మీడియా కొత్త వార్తల్ని హైలైట్ చేస్తోంది.

Advertisement
Update:2024-08-18 20:49 IST

తెలంగాణలో రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు సర్వత్రా వినపడుతున్నాయి. చాలా చోట్ల నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల బీఆర్ఎస్ నేతలు ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు, మరికొన్ని ప్రాంతాల్లో రైతులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల శవయాత్రలు కూడా జరుగుతున్నాయి. ఆ స్థాయిలో నిరసనలు మిన్నంటాయి.

మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. రైతుల రుణమాఫీ విషయంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని, అర్హత ఉండి కూడా రుణమాఫీ కానివారికి న్యాయం చేస్తామని అంటున్నారు. అంతే కాదు.. ఈ వ్యవహారం తీవ్రతను తగ్గించి చూపేలా ప్రభుత్వంపై పాజిటివ్ వార్తలు ప్రచారం చేస్తున్నారు. తాజాగా తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ వార్తల్ని కాంగ్రెస్ సోషల్ మీడియా హైలైట్ చేస్తోంది.

ఒకేసారి 2,400 మందికిపైగా పదోన్నతి కల్పించడం సంతోషకరం అని అంటున్నారు టీజీఎస్పీడీసీఎల్‌ ఉద్యోగులకు. ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసి, పాలాభిషేకాలు చేశారు. ఇకపై మరింత నిబద్ధతతో పని చేస్తామన్నారు. రైతుల మనోభావాలకు అనుగుణంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. పదోన్నతుల కోసం దశాబ్దకాలంగా ఎదురు చూసినా తమకు న్యాయం జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం తమ కష్టాలను పట్టించుకుందని ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నట్టు ఈ వార్తల్ని హైలైట్ చేస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News