హైదరాబాద్ లో రూ.16వేలకోట్లతో మరో మూడు డేటా కేంద్రాలను ఏర్పాటు చేయనున్న మైక్రో సాఫ్ట్

గతేడాది మైక్రోసాఫ్ట్ కంపెనీ మూడు డేటా కేంద్రాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి ప్రకటనతో మొత్తం కేంద్రాల సంఖ్య ఆరుకు చేరనున్నది. ఇప్పుడు ప్రతి కేంద్రం సగటున 100 మెగావాట్ల ఐటి లోడ్‌ను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement
Update:2023-01-19 20:49 IST

హైదరాబాద్ లో రూ.16వేలకోట్లతో మరో మూడు డేటా కేంద్రాలను ఏర్పాటచేయనున్నట్టు మైక్రో సాఫ్ట్ ప్రకటించింది. స్విట్జర్లాండ్‌ దావోస్‌లోని మైక్రోసాఫ్ట్ కేఫ్లో తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, ఐటి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, మైక్రోసాఫ్ట్ ఆసియా ప్రెసిడెంట్ అహ్మద్ మజారీ లు జరిపిన చర్చల్లో ఈ మేరకు ఒప్పందం కుదిరింది.

ఈ ప్రకటనతో, మైక్రోసాఫ్ట్ ఇక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్న మొత్తం డేటా సెంటర్ల సంఖ్య ఆరుకు చేరుకుంటుందని అధికారిక ప్రకటన తెలిపింది.

గతేడాది మైక్రోసాఫ్ట్ కంపెనీ మూడు డేటా కేంద్రాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి ప్రకటనతో మొత్తం కేంద్రాల సంఖ్య ఆరుకు చేరనున్నది. ఇప్పుడు ప్రతి కేంద్రం సగటున 100 మెగావాట్ల ఐటి లోడ్‌ను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కేంద్రాలు భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్‌లకు సేవలందించేందుకు తన క్లౌడ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని మైక్రోసాఫ్ట్ లక్ష్యంగా పెట్టుకున్నది. మొత్తం ఆరు డేటా సెంటర్లు వచ్చే 10-15 సంవత్సరాలలో దశల వారీగా ఏర్పాటు చేస్తారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మైక్రోసాఫ్ట్‌, హైదరాబాద్‌ల మధ్య దీర్ఘకాలిక పరస్పర ప్రయోజనకరమైన బంధం ఉందని, ఇలాంటి భారీ డిజిటల్‌ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను తెలంగాణలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.

మైక్రోసాఫ్ట్ ఆసియా ప్రెసిడెంట్ అహ్మద్ మజారీ మాట్లాడుతూ, "ప్రపంచంలోని మా అత్యంత ముఖ్యమైన మార్కెట్లలో హైదరాబాద్ ఒకటి. మేము ఈ నగరంలో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తాము. తెలంగాణలో మేము డేటా సెంటర్లు మాత్రమే కాకుండా, ఇతర ప్రత్యేక ప్రాజెక్టుల ఏర్పాటుకు అవకాశాలను గుర్తించడానికి,వాటిని అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేస్తాము" అన్నారు.

Tags:    
Advertisement

Similar News