టీ.కాంగ్రెస్‌లో రాజ్యసభ కోసం పోటాపోటీ.. రేసులో ఉంది వీళ్లే..!

అసెంబ్లీలో ప్రస్తుతమున్న బలం ప్రకారం కాంగ్రెస్‌కు 2 స్థానాలు దక్కే అవకాశాలున్నాయి. అయితే కాంగ్రెస్‌ మూడో స్థానానికి కూడా అభ్యర్థిని నిలబెడుతుందని ప్రచారం జరుగుతుంది.

Advertisement
Update:2024-01-30 10:46 IST

తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఫిబ్రవరి 27న ఈ మూడు స్థానాలకు ఎన్నిక జరగనుంది. దీంతో అధికార పార్టీలో ఆశావహుల హడావుడి మొదలైంది. ఒక్కో రాజ్యసభ సభ్యుని ఎన్నిక కోసం 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా.. అసెంబ్లీలో ప్రస్తుతమున్న బలం ప్రకారం కాంగ్రెస్‌కు 2 స్థానాలు దక్కే అవకాశాలున్నాయి. అయితే కాంగ్రెస్‌ మూడో స్థానానికి కూడా అభ్యర్థిని నిలబెడుతుందని ప్రచారం జరుగుతుంది.

ఇక కాంగ్రెస్‌ నుంచి రాజ్యసభ ఆశిస్తున్న వారిలో సీనియర్ నేతలు జానారెడ్డి, వి.హనుమంత రావు, చిన్నారెడ్డి, అద్దంకి దయాకర్, మండవ వెంకటేశ్వర్ రావు, రేణుకా చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన KVP రామచందర్‌రావు పేరు కూడా ఈ లిస్టులో వినిపిస్తోంది. కేవీపీ ఏపీకి చెందిన వ్యక్తి కావడంతో పలువురు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.

ఇక ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతారని తెలుస్తోంది. పార్టీలో చేరిక సందర్భంగా షర్మిలకు ఏఐసీసీ హామీ ఇచ్చింది. కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి.

Tags:    
Advertisement

Similar News