రాజ‌గోపాల్ రెడ్డి, అమిత్ షా లపై మాణిక్కం ఠాగూర్ సెటైర్ వీడియో... కడుపుబ్బ నవ్వుతున్న నెటిజనులు

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్ ట్విట్టర్ లో అమిత్ షా, కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిలపై ఓ సెటైరికల్ వీడియో పోస్ట్ చేశారు. అమిత్ షా గూగూల్ పే ద్వారా రాజగోపాల్ రెడ్డికి 22 వేల కోట్లు ట్రాన్స్ ఫర్ చేసినట్టు గా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement
Update:2022-10-11 16:35 IST

మునుగోడు ఉప ఎన్నిక వేడి బాగానే రాజుకుంటోంది. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. మరొక వైపు సెటర్లు కూడా వేస్తున్నారు. కొద్ది సేపటి క్రితం కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. అమిత్ షా, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిలపై తయారు చేసిన ఈ సెటైర్ వీడియో నెటిజనులను కడుపుబ్బా నవ్విస్తోంది.

ఠాగూర్ పోస్ట్ చేసిన వీడియోలో ముందుగా గూగుల్ పే స్క్రీన్‌పై మోదీ, అమిత్ షా ల‌ఫొటో క‌నిపిస్తుంది. ఆ త‌ర్వాత ఆర్‌జీ పాల్ పేరు కొట్టగానే... రాజ‌గోపాల్ రెడ్డి ఖాతా క‌నిపిస్తుంది. అందులో అమిత్ షా గారూ , మునుగోడు అమ్మకానికి ఉంది అని రాజ్ గోపాల్ రెడ్డి నుంచి మెసేజ్ వస్తుంది. వెంటనే అమిత్ షా రాజ్ గోపాల్ రెడ్డి ఖాతాకు 22,000 కోట్ల‌ను పంపించి వెల్‌క‌మ్ టూ బీజేపీ అని మెసేజ్ చేస్తాడు.అమిత్ షా ఖాతా నుంచి కోమ‌టిరెడ్డి ఖాతాకు రూ.22,000 కోట్లు జ‌మ అవుతాయి.

ఈ ట్రాన్సాక్ష‌న్ చేసినందుకు అమిత్ షాకు ఓ స్క్రాచ్ కార్డు వస్తుంది. అమిత్ షా దానిని ఓపెన్ చేయగా బెట‌ర్ ల‌క్ నెక్ట్స్ టైమ్‌... మునుగోడు నాట్ ఫ‌ర్ సేల్ అనే మెసేజ్ క‌నిపిస్తుంది.

ఆ వీడియో మీరు కూడా చూడండి...


Tags:    
Advertisement

Similar News