అధికార లాంఛనాలతో మందా జగన్నాథం అంత్యక్రియలు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
మాజీ ఎంపీ మంద జగన్నాథం అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కుటుంబ సభ్యులు ఆయన అంత్యక్రియలు హైదరాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఎక్కడ అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయిస్తే ఆ జిల్లా కలెక్టర్ అధికార లాంఛనాలతో అంతిమసంస్కారం నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. పోలీస్ బ్యాండ్‌తో ఆయన అంతిమయాత్ర నిర్వహించాలని, పోలీస్ వందనం సమర్పించాలని ఆదేశించారు.
దామోదర నివాళులు
మాజీ ఎంపీ మందా జగన్నాథం పార్థివ దేహానికి మంత్రి దామోదర రాజనర్సింహ నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. జగన్నాథంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎంపీగా ఆయన ప్రజలకు ఎన్నో సేవలందించారని.. నిత్యం ప్రజల గురించి పరితపించే నాయకుడిని రాష్ట్రం కోల్పోయిందన్నారు.