మనవరాలు పెళ్లిలో స్టెప్పులుతో ఇరగదీసిన మల్లారెడ్డి.. వీడియో వైరల్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి తన మనవరాలు పెళ్లి సంగీత్ కార్యక్రమంలో ఆయన 'డీజే టిల్లు' పాటకు డ్యాన్స్‌తో ఇరగదీశారు.

Advertisement
Update:2024-10-21 14:51 IST

తన డైలాగ్, ప్రసంగాలతో ఇరగదీసే మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తన మనవరాలి పెళ్లి సంగీత్‌లో డ్యాన్స్‌తో ఇరగదీశారు. వైట్ కలర్ సూటుబూటులో మరికొందరితో కలిసి ఆయన అదిరిపోయే స్టెప్పులు వేశారు. తన మనవరాలు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహం ఈ నెల 27న జరగనుంది. ఈ పెళ్లి సంగీత్ కార్యక్రమంలో ఆయన 'డీజే టిల్లు' పాటకు డ్యాన్స్ చేశారు. మల్లారెడ్డి డ్యాన్స్ కు చెందిన వీడియో సోషల్ మీడియో వైరల్ అవుతోంది.

ఈ వయసులో కూడా మల్లారెడ్డి చేసిన డ్యాన్స్ చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వ కార్యక్రమమైన మూవీ పంక్షన్ అయిన వేదిక ఏదేనా మల్లారెడ్డి ఉన్నరంటే ఆ కిక్కు వేరు. ఆయన మైక్ పట్టున్నారంటే చాలు 'కష్టపడ్డా.. పాలమ్మినా.. సక్సెస్‌ అయ్యా' డైలాగ్‌ ప్రేక్షకుల నుంచి వినబడక మానదు. ఆ ఒక్క డైలాగ్‌తో సోషల్‌ మీడియాలోనూ తెగ పాపులర్‌ అయిన మంత్రి.. తాజాగా తన డ్యాన్స్‌ ఫెర్ఫార్మెన్స్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం మల్లారెడ్డి డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌వుతుంది.

Tags:    
Advertisement

Similar News