సీఎం రేవంత్‌రెడ్డి పై మాదిగలు మ‌రో పోరాటానికి సిద్దం కావాలి : మందకృష్ణ

మరో ఉద్యమానికి మాదిగ, ఉపకులాలు సిద్ధంగా ఉండాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. . సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Advertisement
Update:2024-10-17 15:15 IST

మాదిగ, ఉపకులాలను నమ్మించి నమ్మక ద్రోహానికి పాల్పడ్డ సీఎం రేవంత్‌రెడ్డి పై మరో పోరాటానికి సిద్దంగా ఉండాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్య‌క్షుడు జాతీయ మంద‌కృష్ణ మాదిగ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్‌లో కృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా ఆగ‌స్టు 1వ తేదీన నిండు అసెంబ్లీలో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ తొలుత దేశంలో తెలంగాణ రాష్ట్రం అమ‌లు చేస్త‌ద‌ని హామీ ఇచ్చారని తెలిపారు. వ‌ర్గీక‌ర‌ణ అమ‌లు చేసే తొలి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుంద‌న్నా ఆ హామీని నిల‌బెట్టుకోలేదని ఆయన అన్నారు. ఎస్సీ రిజ‌ర్వేష‌న్ల అమ‌ల్లో పంజాబ్, త‌మిళ‌నాడు రాష్ట్రాలు ముందు వ‌స‌రులో ఉన్నాయ‌ని మంద‌కృష్ణ తెలిపారు.ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అమ‌లు చేస్తామ‌న్న ముఖ్యమంత్రి మాట‌ల‌కు విలువ లేకుండా పోయింది.

తేనే పూసిన క‌త్తిలా ఆయ‌న మాట‌లు ఉంటాయి. ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డంలో ఘ‌నుడే.. మోసం చేయ‌డంలో అంత‌కంటే ఘ‌నుడని మందా కృష్ణ ఆరోపించారు. మాదిగ‌ల ప‌ట్ల ఆయ‌న మాట‌లు తేనే పూసిన‌ట్టు ఉంటాయి. కానీ అవి మాకు తీపిని అందించ‌వు. మాకు చేదుగానే, మోసంగానే ఉంటాయని మంద‌కృష్ణ తెలిపారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ కానీ అన్ని నోటిఫికేష‌న్ల‌లో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అమ‌లు చేస్తామ‌ని హామీ ఇచ్చిన సీఎం దీన్ని కూడా ఆయ‌న‌ విస్మ‌రించాడు. ఇవాళ మాదిగల జాతి పొట్ట కొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన అన్నారు.11 వేల‌కు పైగా టీచర్లు పోస్టుల భ‌ర్తీ చేసి అక్టోబ‌ర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామ‌క ప‌త్రాలు అందించారు. వ‌ర్గీక‌ర‌ణ అమ‌లు చేయ‌కుండానే నియామ‌క ప‌త్రాలు అంద‌జేశారు. ఇంది మాదిగ బిడ్డ‌ల పొట్ట కొట్టిన‌ట్టు కాదా..? అని రేవంత్ రెడ్డిని మంద‌కృష్ణ మాదిగ నిల‌దీశారు.

Tags:    
Advertisement

Similar News