లారీ బీభత్సం.. ముగ్గురి మంది మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ముగ్గురి మంది మృతి చెందారు
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం ఆలూరు గేటు వద్ద కూరగాయల లోడ్‌తో వెళ్లున్న లారీ అదుపుతప్పి వ్యాపారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురి మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులను రాములు (ఆలూరు), ప్రేమ్ (ఆలూరు), సుజాత (ఖానాపూర్)గా గుర్తించారు. ఈ ఘటనలో మరికొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.ప్రమాద సమయంలో మొత్తం 50 మందికి పైగా వ్యాపారులు రోడ్డుపై కూరగాయలు అమ్ముకుంటున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.