రైతుల అప్పులు ముఖ్యమా.. దావోస్‌ డప్పులు ముఖ్యమా?

రైతుభరోసా చిల్లర పంచాయితీనా : సీఎం రేవంత్‌ రెడ్డిపై హరీశ్‌ రావు ఫైర్‌

Advertisement
Update:2025-01-28 17:33 IST

రైతుల అప్పులు ముఖ్యమా.. దావోస్‌ డప్పులు ముఖ్యమా అని సీఎం రేవంత్‌ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. సెక్రటేరియట్‌లో ప్రెస్‌మీట్‌ సందర్భంగా రైతుభరోసాను చిల్లర పంచాయతీగా రేవంత్‌ రెడ్డి పేర్కొనడంపై 'ఎక్స్‌' వేదికగా హరీశ్‌ రావు ఫైర్‌ అయ్యారు. ''మీ సెల్ఫ్ డబ్బాకు.. మీ వెకిలి సెటైర్లకు కాలం చెల్లింది.. ఇకనైనా కళ్లు తెరువు రేవంత్ రెడ్డి.. నీలో అటెన్షన్ డిక్రీసింగ్ డిజార్డర్ మొదలైంది.. నీ మాటలు ఎవరు నమ్మడం లేదనే ఆందోళన పెరిగిపోయింది...మంచి మానసిక వైద్యుడిని సంప్రదించడం మంచిది..'' అని సలహా ఇచ్చారు. సీఎం ప్రెస్ మీట్ ఎలా ఉందంటే.. పెట్టుబడుల కట్టు కథను నమ్మించేందుకు శత విధాలా ప్రయత్నించి అట్టర్ ఫ్లాప్ అయినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ''మీ ప్రెస్ రిలీజులు.. మీ మీడియా కవరేజీలు.. మీ ఈనో స్టోరీలు ఎవరూ నమ్మడం లేదనే ప్రెస్ మీట్ పెట్టావు.. ఎప్పుడో అయిపోయిన దావోస్ కు ఇప్పుడు ఎందుకు ఈ దావతు.. దావోస్ లో జరిగే ఎంఓయూలు అన్నీ కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే, ఎవరైనా ఓపెన్ టెండర్ లో రావాల్సిందే.. అని ఆర్థిక మంత్రి భట్టి అంటే, మీరేమో రూ.1.82 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినట్లు గప్పాలు చెబుతున్నారు. సీఎం చెప్పింది నిజమా.. డిప్యూటీ సీఎం చెప్పింది నిజమా.. ఎవరి మాటలు నమ్మాలి'' అని ప్రశ్నించారు.

సీఎం ప్రెస్‌ మీట్‌లో చెప్పిన పెట్టుబడుల లెక్కలు, పొంతనలేని కంపెనీల వివరాలను తెలంగాణ సమాజం మొత్తం చూసిందని.. ఈ పెట్టుబడులన్నీ వట్టి డొల్ల ప్రచారమని తేలిపోయిందన్నారు. ''రైతు భరోసా కోసం గంపెడు ఆశతో, కొండంత ఆందోళనతో ఎదురు చూస్తున్న రైతుల ఆరాటాన్ని చిల్లర పంచాయితీ అంటవా? ఇంతక ముందు రైతు బంధును బిచ్చం అన్నావు, ఇప్పుడు రైతు భరోసాను చిల్లర పంచాయితీ అంటున్నావు.. సంక్రాంతికి ఇస్తానన్న సంగతి తేలిపోయింది, చబ్బీస్ (26) జనవరి చేదు మాత్రనే అయ్యింది.. ఇప్పుడు మార్చి 31 దాకా గడువు పెంచినవు.. జర్నలిస్టులు ఇదేమని అడిగితే చిల్లర పంచాయితీ అంటున్నావు.. అప్పుల పాలవుతున్న రైతుల ఆవేదన పక్కన పెట్టీ మీ ప్రచారం వినాలా?'' అని నిలదీశారు.

Tags:    
Advertisement

Similar News