ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై జీవో

జీవో ఇస్తేనే భారత మాత విగ్రహాలు పెట్టుకుంటామా? అని ప్రశ్నించిన కవిత

Advertisement
Update:2024-12-13 12:14 IST

తెలంగాణ తల్లి ఏర్పాటుపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గెజిట్‌ ఇవ్వడం దారుణమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారి విగ్రహాలు పెట్టుకుంటామని.. జీవో ఇస్తేనే అవి పెడతామా అని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో స్ఫూర్తి నింపిన తెలంగాణ తల్లి విగ్రహాలను బీఆర్‌ఎస్‌ హయాంలో ఏర్పాటు చేశామన్నారు.

ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై జీవో ఇచ్చారు. అధికార పార్టీది తెలంగాణ వాదం కాదు.. కాంగ్రెస్‌ వాదం అని ఎద్దేవా చేశారు. వాళ్లకు పార్టీ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇందిరాగాంధీ, సోనియా, రాహుల్‌ కూడా బతుకమ్మ ఆడారని వాటికి సంబంధించిన వీడియోలను చూపెట్టారు. బీఆర్‌ఎస్‌ హయాంలో బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించాం. దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేశాం. బతుకమ్మను అవమానించేలా మాట్లాడిన మంత్రులపై ఏం చర్యలు తీసుకుంటారు? జీవో ఇస్తేనే భారత మాత విగ్రహాలు పెట్టుకుంటామా? అని కవిత ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News