మందు బాబులకు బ్యాడ్ న్యూస్

25న ఉదయం 6 గంటల నుంచి 26న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు మూతపడనున్నాయి.

Advertisement
Update:2024-03-24 17:48 IST

మందుబాబులకు పోలీసులు చేదువార్త చెప్పారు. హోలీ పండుగ సందర్భంగా బార్ అండ్ రెస్టారెంట్‌లు, కల్లు దుకాణాలు బంద్ పెట్టాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్‌తోపాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలు జరగకుండా వైన్స్ షాపులను మూసి ఉంచాలని పోలీసులు సూచించారు. స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్బులకు మాత్రం రిలాక్సేషన్ ఇచ్చారు. ఈ మేరకు మూడు కమిషనరేట్‌ల నుంచి ఆదేశాలు విడుదలయ్యాయి.

25న ఉదయం 6 గంటల నుంచి 26న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు మూతపడనున్నాయి. హోలీ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

హోలీ పండుగను ఆనందంగా, ఇతరులకు ఇబ్బంది కలుగకుండా జరుపుకోవాలని పోలీసులు సూచించారు. రోడ్లపై ఇష్టారీతిన వేడుకలు జరుపుకుంటూ వచ్చీపోయే వారికి ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్లపై వెళ్లే వారిపై, వాహనదారులపై రంగులు చల్లితే కఠిన చర్యలుంటాయన్నారు. అదేవిధంగా రోడ్లపైకి గుంపులుగా రావొద్దని సూచించారు.

Tags:    
Advertisement

Similar News