మహారాష్ట్ర కాంగ్రెస్ ఓటమిపై.. సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్ సలహా

భారతదేశంలో ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలదే హవా అని మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికల ఫలితాలతో మరోసారి వెల్లడైందని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Advertisement
Update:2024-11-23 14:41 IST

దేశంలో ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలకే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలలో మరోసారి వెల్లడైందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అసమర్ధత వల్లనే బీజేపీ పుంజుకుందని పేర్కొన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా అవతరించడంలో విఫలమైందని..కానీ ప్రాంతీయ పార్టీలను నాశనం చేయడంలో తలమునకలవుతోందని.. ఇది పునరావృతమయ్యే అంశంగా మారిందన్నారు.

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ ఓ సలహా ఇచ్చారు. మీ ప్రచారాలు, ప్రసంగాలు బ్యాగులు, ఛాపర్‌లు మీ కాంగ్రెస్ పార్టీని ఘోర వైఫల్యం నుండి కాపాడలేకపోయాయని ఎద్ధేవా చేశారు. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా మీ ప్రాథమిక కర్తవ్యంపై దృష్టి సారించి, ఏడాది క్రితం తెలంగాణ ప్రజలకు మీరు వాగ్దానం చేసిన ఆరు గ్యారెంటీ హామీలను నెరవేర్చలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News