నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ లేఖ!

డేటా ఎంబసీలను ఒకే చోట ఏర్పాటు చేయడం వల్ల కలిగే భారీ నష్టాలను వివరిస్తూ, అది కూడా భూకంపాలు ఎక్కువగా సంభవించే రాష్ట్రంలో ఏర్పాటు చేయడం మంచిది కాదని కేటీఆర్ తన లేఖలో పేర్కొనారు. ఈ రాయబార కార్యాలయాలు తెలంగాణలో ఏర్పాటు చేయడం వల్ల కలిగే ఉపయోగాలను కేటీఆర్ వివరించారు.

Advertisement
Update:2023-02-17 06:41 IST

గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (GIFT సిటీ )లో అంతర్జాతీయ డేటా రాయబార కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.

డేటా ఎంబసీలను ఒకే చోట ఏర్పాటు చేయడం వల్ల కలిగే భారీ నష్టాలను వివరిస్తూ, అది కూడా భూకంపాలు ఎక్కువగా సంభవించే రాష్ట్రంలో ఏర్పాటు చేయడం మంచిది కాదని కేటీఆర్ తన లేఖలో పేర్కొనారు. ఈ రాయబార కార్యాలయాలు తెలంగాణలో ఏర్పాటు చేయడం వల్ల కలిగే ఉపయోగాలను కేటీఆర్ వివరించారు.

గుజరాత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంది. ఇలాంటి చోట అంతర్జాతీయ డేటా రాయబార కార్యాలయాలను నెలకొల్పడం భద్రతకు ముప్పును కలగజేస్తుందని కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్ భారతదేశంలో అతి తక్కువ చురుకైన భూకంప జోన్‌లలో ఒకటని, ఇది డేటా సెంటర్‌ల ఏర్పాటుకు అనువైన ప్రదేశం అని ఆయన అన్నారు.

"దీనికి విరుద్ధంగా, గుజరాత్ భూకంపాల జోన్ లో ఉంది. అక్కడ భూకంప ప్రమాదాలు ఎక్కువ. అటువంటి ప్రాంతంలో అంతర్జాతీయ డేటా రాయబార కార్యాలయాలను అభివృద్ధి చేయడం ప్రమాదం. అక్కడ ఏదైనా జరిగితే అంతర్జాతీయ సంబంధాలపై గణనీయమైన పరిణామాలను కలిగిస్తుంది, ”అని ఆయన అన్నారు.

గ్లోబల్ డేటా సెంటర్లు తమ భారీ డేటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణను ఎంచుకున్నారని మంత్రి తెలిపారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ నుండి మైక్రోసాఫ్ట్ అజూర్ వరకు, రాష్ట్రం ఇప్పుడు అనేక హైపర్‌స్కేల్, ఎడ్జ్ డేటా సెంటర్‌లకు నిలయంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం 2016లో డేటా సెంటర్ పాలసీని ప్రారంభించిందని, అనేక ప్రోత్సాహకాలు అందించిందని ఆయన అన్నారు.

తక్కువ‍ ధరకు విద్యుత్ సరఫరా , హై-స్పీడ్ ఫైబర్ నెట్‌వర్క్ లాంటివి ఇక్కడ్ ఆందిస్తున్నామని కేటీఆర్తెలిపారు.

‘‘తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన కంపెనీల అనుభవం చాలా సానుకూలంగా ఉంది. అంతర్జాతీయ డేటా రాయబార కార్యాలయాలకు ఇదే విధమైన మద్దతును అందిస్తాం ”అని కేటీఆర్ చెప్పారు. వారి డేటా భద్రతా అవసరాలకు సరిపోయే విధంగా ఒక్క గుజరాత్ లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసేందుకు బడ్జెట్ ప్రతిపాదనను సవరించాలని సీతారామన్‌ను కోరారు. 

Tags:    
Advertisement

Similar News