'నమ్మి నానబోస్తే 'లఘు చిత్రాన్ని వీక్షించిన కేటీఆర్

మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో ఏడాది కాంగ్రెస్ పాలనపై రూపొందిన 'నమ్మి నానబోస్తే 'లఘు చిత్రాన్ని బీఆర్ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ వీక్షించారు .

Advertisement
Update:2024-12-07 17:24 IST

కాంగ్రెస్ ప్రభుత్వం గ‌ద్దెనెక్కి నేటికి ఏడాది పూర్త‌యింది. అయినా ఏం లాభం.. ఏ ఒక్క హామీ నెర‌వేర‌లేదు. అభివృద్ధి, సంక్షేమానికి చోటే లేదు. హామీల‌న్నీ నీటి మీద రాత‌లు గానే మిగిలిపోయాయి. ప్ర‌జ‌లకు క‌న్నీళ్లు మిగిలాయి. ఈ నేప‌థ్యంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్.. రేవంత్ స‌ర్కార్‌ను విమ‌ర్శిస్తూ ఓ పాట‌ను రూపొందించారు. 'నమ్మి నానబోస్తే 'లఘు చిత్రాన్నిమాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్‌లో విడుదల చేసి పార్టీ నేతలతో కలిసి వీక్షించారు. 22 నిమిషాల నిడివి గల ఈ షార్ట్ ఫిలిం తో పాటు 'అంతా ఉత్తదే 'అనే పేరిట రసమయి పాడిన పాటను కూడా ప్రదర్శించారు.

షార్ట్ ఫిలిం రాష్ట్రం లో నెలకొన్న పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు వివరించిందని కేటీఆర్ అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్నికి ఓట్లేసే గెలిపిస్తే.. తెలంగాణ‌కు పాణ‌గండం అయిపాయే ఓరి దేవుడా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ల‌క్ష రూపాయాలు, తులం బంగారం, ఇందిర‌మ్మ ఇండ్లు, పెన్ష‌న్లు, రుణ‌మాఫీ, రైతుభ‌రోసా, రైతుకూలీ, అన్ని వ‌డ్ల‌కు బోన‌స్‌.. అన్నీ ఉత్త‌యే అని పేర్కొన్నారు. ఈ బ్యాగు పార్టీ మాట‌ల‌న్నీ నీటి మూట‌లే అని విమ‌ర్శించారు. న‌మ్ముకున్న రైతుల‌ను నిండా ముంచెనే అని రేవంత్ రెడ్డిని ర‌స‌మ‌యి దుయ్య‌బ‌ట్టారు. శాసమండలి ప్రతిపక్ష నేత ఎస్ మధుసుధనా చారి, దేశపతి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, రసమయిను అభినందించారు.

Tags:    
Advertisement

Similar News