కదనభేరి సభకు కేటీఆర్ దూరం.. ఎందుకంటే..?

కొద్ది రోజులుగా విస్త్రృతంగా అనేక పార్లమెంటరీ పార్టీ సన్నాహక సమావేశాల్లో పాల్గొన్న కేటీఆర్...గత రెండు రోజులుగా తీవ్రమైన జ్వరం, ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నారు.

Advertisement
Update:2024-03-12 15:20 IST

కరీంనగర్‌లో బీఆర్ఎస్‌ నిర్వహించే కదనభేరి సభకు దూరంగా ఉండనున్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గత రెండు రోజులుగా ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్‌ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో సమాచారం ఇచ్చింది. కరీంనగర్‌ జరిగే కదనభేరి సభకు కేటీఆర్ హాజరుకాబోరని బీఆర్ఎస్‌ స్పష్టం చేసింది.


కొద్ది రోజులుగా విస్త్రృతంగా అనేక పార్లమెంటరీ పార్టీ సన్నాహక సమావేశాల్లో పాల్గొన్న కేటీఆర్...గత రెండు రోజులుగా తీవ్రమైన జ్వరం, ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నారు. మూడు రోజుల కింద కామారెడ్డిలో జరిగిన సమావేశం అనంతరం జ్వరంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. అప్పటినుంచి కేటీఆర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఇంటి దగ్గరే చికిత్స తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఒకటి,రెండు రోజుల్లో కేటీఆర్‌ పూర్తిగా కోలుకుంటారని చెప్పారు డాక్టర్లు.

మరోవైపు కరీంనగర్ సభ విజయవంతం అయ్యేలా పార్టీ పరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు కేటీఆర్. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ప్రతినిధులతో తన కార్యాలయం ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News