కేటీఆర్ ట్వీట్ కి వెంటనే స్పందించిన పోలీసులు

పోలీసులకు, అధికారులకు.. సామాన్య ప్రజలే జీతాలు చెల్లిస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు కేటీఆర్. ప్రజలతో తెలంగాణ పోలీసులు మెలిగే పద్ధతి ఇదేనా అంటూ డీజీపీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ వేశారు.

Advertisement
Update:2024-07-18 12:31 IST

అమ్మ, ఆలి బూతులు..

వినడానికి కూడా అసహ్యంగా ఉన్న భాష అది..

పేరుకే ఫ్రెండ్లీ పోలిసింగ్.. కానీ వారి అసలు భాష ఇది..

తెలంగాణలో ట్రాఫిక్ పోలీసులు ఓ లారీ డ్రైవర్ ని బండబూతులు తిట్టిన ఘటన సంచలనంగా మారింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అసలు ఆ భాష ఏంటి..? ఆ తిట్లు ఏంటి..? అంటూ మండిపడుతున్నారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఘాటు ట్వీట్ వేశారు. ప్రజలతో తెలంగాణ పోలీసులు మెలిగే పద్ధతి ఇదేనా అంటూ డీజీపీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ వేశారు.

పోలీసులకు, అధికారులకు.. సామాన్య ప్రజలే జీతాలు చెల్లిస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు కేటీఆర్. కేవలం ఈ ఘటన గురించే తాను ట్వీట్ వేయడం లేదని, ఇటీవల కాలంలో పోలీసులు ప్రజలతో ప్రవర్తిస్తున్న తీరు సరిగా లేదని ఆయన చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తే పోలీసుల ప్రవర్తన ఎలా ఉందో అర్థమవుతుందని అన్నారు. ఈ విషయంలో పోలీసులకు తగిన సూచనలు ఇవ్వాలని, ప్రజలతో ఎలా మసలుకోవాలో వారికి అర్థమయ్యేలా చెప్పాలని డీజీపీకి సూచించారు కేటీఆర్.


కేటీఆర్ ట్వీట్ కి వెంటనే తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ రియాక్ట్ అయింది. బూతులు మాట్లాడిన పోలీస్ ని బదిలీ చేశామని, శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ డిపార్ట్ మెంట్ ట్వీట్ వేసింది. ప్రజా సేవకు తాము 24 గంటలు నిబద్ధతతో ఉంటామని చెబుతూ.. కేటీఆర్, తెలంగాణ డీజీపీని కూడా ఆ ట్వీట్ లో ట్యాగ్ చేశారు. 



Tags:    
Advertisement

Similar News