తెలంగాణ భవిష్యత్తుకు సంకేతం అదేనా..?

"ఎక్కడుంది డబ్బు..? ఎక్కడ్నుంచి తెమ్మంటారు డబ్బు..? ఎన్నికల సమయంలో మేము హామీలిచ్చాం. అన్నిటినీ నిలబెట్టుకోలేకపోతున్నాం." అంటూ కర్నాటక అసెంబ్లీలో సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వ్యాఖ్యల్ని కోట్ చేస్తూ కేటీఆర్ ఇలా తన సమాధానమిచ్చారు.

Advertisement
Update:2023-12-19 09:41 IST

తెలంగాణ భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుందా అంటూ ఆసక్తికర ట్వీట్ వేశారు మాజీ మంత్రి కేటీఆర్. అలవికాని హామీలిచ్చి, ఇప్పుడు వాటిని అమలు చేసేందుకు తమ వద్ద నిధులు లేవని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అంటున్నారని చెప్పారు. తెలంగాణలో కూడా ఇలాంటి హామీలతోనే కాంగ్రెస్ నేతలు ప్రజల్ని మభ్యపెట్టారని, అంటే ఇక్కడ కూడా అలాంటి మాటలు వినాల్సి వస్తుందేమోనన్నారు. అలవికాని హామీలిచ్చేముందు కనీసం సాధ్యాసాధ్యాలను ఆలోచించరా..> అని ఆయన ప్రశ్నించారు. కర్నాటక అసెంబ్లీలో సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యల వీడియోకు ఆయన ఇలా సమాధానమిచ్చారు.


ఇంతకీ సిద్ధరామయ్య ఏమన్నారు..?

"ఎక్కడుంది డబ్బు..? ఎక్కడ్నుంచి తెమ్మంటారు డబ్బు..? ఎన్నికల సమయంలో మేము హామీలిచ్చాం. అన్నిటినీ నిలబెట్టుకోలేకపోతున్నాం." అంటూ కర్నాటక అసెంబ్లీలో సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వ్యాఖ్యల్ని కోట్ చేస్తూ కేటీఆర్ ఇలా తన సమాధానమిచ్చారు. తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని అన్నారు. ఇటీవల అసెంబ్లీలో కూడా కేటీఆర్ ఆరు గ్యారెంటీలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. అధికారంలోకి వచ్చాక అన్నిటినీ అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అయితే రెండు గ్యారెంటీలను, వాటిలో కూడా కొన్ని అంశాలను మాత్రమే అమలు చేశారని గుర్తుచేశారు. 100 రోజుల డెడ్ లైన్ పెట్టుకున్న కాంగ్రెస్ అన్నిట్నీ అమలు చేయాల్సిందేనన్నారు.

వాయిదా పద్ధతుంది దేనికైనా..?

ఆరు గ్యారెంటీల అమలు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నారు.. ఒకటి రెండు శాంపిల్ చూపించి మిగతావి 100 రోజుల తర్వాత అన్నారు.. ఇంకొకటి రెండిటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మిగతావి లోక్ సభ ఎన్నికల తర్వాత అన్నా కూడా ఆశ్చర్యం లేదని అంటున్నారు నెటిజన్లు. లోక్ సభ ఎన్నికలైపోయిన తర్వాత కర్నాటక లాగే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో చేతులెత్తేస్తుందని సెటైర్లు పేలుస్తున్నారు. మరి కాంగ్రెస్ మాట మీద నిలబడుతుందా, లేక కర్నాటకలో లాగే జనాలకు షాకిస్తుందా అనేది వేచి చూడాలి. 

*

Tags:    
Advertisement

Similar News