ఇది కాంగ్రెస్ గూండాల పనే.. కేటీఆర్ ఘాటు ట్వీట్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు కేటీఆర్. థర్డ్ రేట్ క్రిమినల్ ని తెలంగాణ కాంగ్రెస్ కి అధ్యక్షుడిగా చేసినప్పుడే ఇలాంటి పరిణామాలు ఊహించామని చెప్పారు.
బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు మంత్రి కేటీఆర్. ఈ ఘటనపై ఆయన ఘాటు ట్వీట్ వేశారు. ఇది కాంగ్రెస్ గూండాల పనేనని చెప్పారు. నిరాశలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులపై భౌతిక దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
క్రిమినల్ చేతిలో పార్టీ పెడితే ఏం జరుగుతుంది..?
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు కేటీఆర్. థర్డ్ రేట్ క్రిమినల్ ని తెలంగాణ కాంగ్రెస్ కి అధ్యక్షుడిగా చేసినప్పుడే ఇలాంటి పరిణామాలు ఊహించామని చెప్పారు. అలాంటి వారిని పార్టీ అధ్యక్షుడిగా చేస్తే ఇంతకంటే ఇంకేం ఆశిస్తామన్నారు. రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పరోక్షంగా మండిపడ్డారు మంత్రి కేటీఆర్.
ప్రస్తుతం కొత్త ప్రభాకర్ రెడ్డికి హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ఆపరేషన్ జరుగుతోందని మంత్రి హరీష్ రావు కాసేపటి క్రితం తెలియజేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రకటన చేయాల్సి ఉంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని తనపై జరిగిన దాడిగానే భావిస్తానని అన్నారు సీఎం కేసీఆర్. చూస్తూ ఊరుకునేది లేదని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హత్యాయత్నంపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు రాజుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
♦