లగచర్ల ఘటనలో అరెస్టైన వారితో ములాఖత్‌ కానున్న కేటీఆర్‌

కేటీఆర్‌తో సహా ఆరుగురిని అనుమతిచ్చిన జైలు అధికారులు

Advertisement
Update:2024-11-15 11:32 IST

లగచర్ల ఘటనలో అరెస్ట్‌ సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని సెంట్రల్‌ జైలులో ఉన్న 16 మందితో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ములాఖత్‌ కానున్నారు. కేటీఆర్‌తో సహా ఆరుగురిని జైలు అధికారులు అనుమతిచ్చారు. కారాగారానికి 500 మీటర్ల పరిధిలో పోలీసులు ఎవరినీ అనుమతించలేదు. ఈ ఘటనలో ఇప్పటికే 21 మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో 16 మందిని నిన్న పరిగి జైలు నుంచి సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని సెంట్రల్‌ జైలుకు తరలించారు. కేటీఆర్‌ వస్తుండటంతో జైలు ప్రధాన ద్వారం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న డీఎస్పీ, సీఐలు, ఎస్‌లు అక్కడికి చేరుకున్నారు. ఉన్నతాధికారులు ఈ జైలు పరిధిలోకి ఎవరిని అనుమతించడం లేదు. కేటీఆర్‌ ముందుగా స్థానికంగా ఉన్న నేతలు, కార్యకర్తలను కలుస్తారు. అనంతరం కంది జైలుకు వెళ్లనున్నారు. వారిని పరామర్శించి, బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించనున్నారు. సంగారెడ్డి జైలులో కొడంగల్ నియోజకవర్గం, లగచర్ల గ్రామ రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమార్గమధ్యంలో పటాన్ చెరులో బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికాయి.

Tags:    
Advertisement

Similar News