భట్టి, పొంగులేటి, ఉత్తమ్ ఫోన్లు ట్యాపింగ్.. కేటీఆర్ సంచలనం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫోన్లు రేవంత్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. ఇక తనపై చిల్లర ఆరోపణలు చేసిన వారికి నోటీసులు ఇస్తానని హెచ్చరించారు.
ప్రస్తుతం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులు అరెస్టు కాగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పైనా ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా టీవీ-9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫోన్ ట్యాపింగ్ అంశంపై క్లారిటీ ఇచ్చారు కేటీఆర్. తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. తనకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదన్నారు.
ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి తన ఫోన్‌తో పాటు కేబినెట్‌లోని సొంత మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫోన్లు రేవంత్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. ఇక తనపై చిల్లర ఆరోపణలు చేసిన వారికి నోటీసులు ఇస్తానని హెచ్చరించారు. ఇప్పటికే మంత్రి కొండా సురేఖకు నోటీసులు పంపానని స్పష్టం చేశారు.
తనకు ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేదని నిరూపించుకోడానికి ఎలాంటి టెస్టులకైనా సిద్దమేనన్నారు కేటీఆర్. బహిరంగ వేదికలపై లేదంటే గన్ పార్క్ వద్ద రాష్ట్ర ప్రజలందరి ముందు లై డిటెక్టర్ టెస్ట్ లేదా నార్కో అనాలిసిస్ టెస్టుకు సిద్ధమేనన్నారు. ఈ టెస్టుకు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
యూపీఏ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌ను సాక్షాత్తూ అప్పటి ప్రధాని మన్మోహన్ సమర్థించారని చెప్పారు కేటీఆర్. ట్యాపింగ్‌ను సమర్థిస్తూ మన్మోహన్ మాట్లాడిన వీడియోను కూడా ప్లే చేశారు. RTI ఇచ్చిన సమాచారం ప్రకారం యూపీఏ హయాంలో శరద్‌పవార్, నితీష్ కుమార్‌తో పాటు దాదాపు 9 వేల మందికిపైగా ఫోన్లు ట్యాప్ అయ్యాయని వివరాలు బయటపెట్టారు కేటీఆర్.