మార్పు మహత్యం.. రేవంత్‌ సర్కార్‌పై కేటీఆర్ సెటైర్‌

కరెంటు సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయంపై స్పందించిన కేటీఆర్.. ఇలాంటి ధర్నాలు చూసి చాలా కాలమయిందంటూ ట్వీట్ చేశారు.

Advertisement
Update: 2024-07-20 05:40 GMT

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మరోసారి టార్గెట్ చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. తాజాగా కరెంటు కోతల విషయంలో రేవంత్ సర్కార్‌పై సెటైర్ వేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేసిన కేటీఆర్‌.. మార్పు మహత్యం ఇదే అంటూ ఎద్దేవా చేశారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..?

నాగర్‌కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం చేగుంట ప్రజలు కొన్ని రోజులుగా విద్యుత్ కోతలతో ఇబ్బంది పడుతున్నారు. గృహ అవసరాలకు, వ్యవసాయానికి కరెంటు సరిగ్గా స‌ర‌ఫ‌రా కాకపోవడంతో ఆందోళనకు దిగారు. సబ్‌స్టేషన్‌కు తాళం వేసి ధర్నా చేశారు. కరెంటు సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయంపై స్పందించిన కేటీఆర్.. ఇలాంటి ధర్నాలు చూసి చాలా కాలమయిందంటూ ట్వీట్ చేశారు. మార్పు మహత్యం ఇదే అంటూ సెటైర్ వేశారు.


కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కరెంటు కోతలు ఎక్కువయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ను సైతం పవర్‌ కట్ సమస్య వెంటాడుతోంది. చిన్నపాటి వర్షం వచ్చినా కరెంటు తీసేస్తున్నారంటూ మండిపడుతున్నారు. అయితే గత ప్రభుత్వం కన్నా మరింత మెరుగ్గా విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నప్పటికీ.. కరెంటు కోతలపై విమర్శలు ఆగట్లేదు.

Tags:    
Advertisement

Similar News