యాదాద్రి తరహాలో వేములవాడను అభివృద్ధి చేస్తామన్న కేటీఆర్
వేముల వాడ ఆలయ అభివృద్దిపై కేటీఆర్ ఈ రోజు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వేములవాడ శాసన సభ్యులు రమేశ్ బాబు కూడా పాల్గొన్నారు.
వేములవాడ ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ది చేస్తామని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. త్వరలో శివరాత్రి ఉన్నందున ఆ పండుగను దృష్టిలో పెట్టుకొని భారీ ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
వేముల వాడ ఆలయ అభివృద్దిపై కేటీఆర్ ఈ రోజు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వేములవాడ శాసన సభ్యులు రమేశ్ బాబు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ అధికారులను ఉద్దేశించిమాట్లాడుతూ...
''మహా శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదు. భారీ ఎత్తున వసతి సౌకర్యాలు కల్పించాలి. ఈ సారి జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలి. రాష్ట్ర సాంస్కృతిక శాఖతో సమన్వయం చేసుకోవాలి. ఈ సారి వేములవాడ జాతర ఘనంగా నిర్వహించడం కోసం కావాల్సినన్ని అదనపు నిధులు కేటాయిస్తాం.'' అని అన్నారు.