బీఆర్ఎస్‌కు 8-10 ఎంపీ స్థానాలు - కేటీఆర్

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. బీఆర్ఎస్‌ 8-10 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని సర్వేలు చెప్తున్నాయన్నారు కేటీఆర్.

Advertisement
Update:2024-04-23 08:26 IST

అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై 100 రోజుల్లోనే తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన కేటీఆర్.. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. బీఆర్ఎస్‌ 8-10 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని సర్వేలు చెప్తున్నాయన్నారు కేటీఆర్. కాంగ్రెస్‌కు ఓటేయకపోతే ఉచిత బస్సు తీసేస్తామంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. దీనిపై ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ మోసాలను ఎండగడుతూ లోక్‌సభ ఎన్నికల్లో పోరాడదామన్నారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ గెలిచిందన్నారు.

గత ఐదేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి బండి సంజయ్ చేసిందేమి లేదన్నారు కేటీఆర్. ఒక్క విద్యాసంస్థను గానీ, పరిశ్రమను గానీ తీసుకురాలేదన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. వినోద్‌ కుమార్‌ను గెలిపిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు, నేతల గెలుపు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సిరిసిల్లలో మే 10న కేసీఆర్ రోడ్‌ షో ఉంటుందని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News