శుష్క ప్రియాలు.. శూన్య హస్తాలు

పురావస్తు శాఖ లాగా కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వకాలు మొదలు పెట్టిందని, గత పదేళ్లలో ఏం జరిగిందనే విషయాలనే ఇంకా చెప్పుకుంటున్నారని విమర్శించారు కేటీఆర్.

Advertisement
Update:2024-07-31 11:03 IST

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెచ్చుకున్నారని, కరోనా కష్టాలను కూడా రాష్ట్రం తట్టుకుందని చెప్పారని గుర్తు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డిప్యూటీసీఎంగా మారిన తర్వాత ఏమయిందో ఏమో కానీ, గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు. తెలంగాణ సోషియో ఎకనామిక్ ఔట్ లుక్ లో అన్ని వివరాలు ఉన్నాయని చెప్పారు. సోషియో ఎకనామిక్ సర్వేలో మెచ్చుకుని, ఇప్పుడు విమర్శలు చేయడమేంటని కేటీఆర్ ప్రశ్నించారు. భారత దేశాన్ని సాకుతున్న, సాదుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, ఆ విషయాన్ని కాంగ్రెస్ నేతలే చెప్పారని అన్నారు. ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ.. ఇవాళ ఉజ్వల తెలంగాణగా వెలుగుతున్నదనేది వాస్తవం అన్నారు కేటీఆర్.


Full View

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఏమీ లేదని

శుష్క ప్రియాలు.. శూన్య హస్తాలు

గ్యారెంటీలకు టాటా.. లంకె బిందెల వేట

డిక్లరేషన్లు డీలా.. డైవర్షన్ల మేళా

హామీ పత్రాలకు పాతర.. శ్వేత పత్రాలకు జాతర

నిరుద్యోగులపై నిర్బంధాలు, జర్నలిస్ట్ లపై దౌర్జన్యాలు, ఆటో అన్నల బలవన్మరణాలు

మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం, బడ్జెట్ లో మాత్రం మోచేతికి బెల్లం..

అంటూ బడ్జెట్ పై సెటైర్లు పేల్చారు కేటీఆర్.

తెలంగాణ రాష్ట్రం ఉజ్వలంగా ఉందని సోషియో ఎకనామిక్ ఔట్ లుక్ లో చెబుతూనే, మరోవైపు రాష్ట్రంపై విమర్శలు చేయడం సరికాదన్నారు కేటీఆర్. తెలంగాణ కేన్సర్ పేషెంట్ లా ఉందని, ఎయిడ్స్ పేషెంట్ లా ఉందనే విమర్శలను ఆయన ఖండించారు. ఎన్నికలైపోయాయని, ఇంకా రాష్ట్రానికి శాపాలు పెట్టడం సరికాదన్నారు. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీగా తప్పకుండా ఈ రాష్ట్ర బాగులు కోరుతూ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికీ తాము మద్దతిస్తామన్నారు కేటీఆర్. పురావస్తు శాఖ లాగా కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వకాలు మొదలు పెట్టిందని, గత పదేళ్లలో ఏం జరిగిందనే విషయాలనే ఇంకా చెప్పుకుంటున్నారని విమర్శించారు.

డిప్యూటీ సీఎం భట్టిపై కూడా సెటైర్లు పేల్చారు కేటీఆర్. చక్కటి బడ్జెట్ అని భట్టి అంటున్నారని, ఆయన ఆ శాఖను సమర్థంగా నిర్వహించాలని, అవకాశం ఉంటే పక్క కుర్చీలోకి కూడా పోయే విధంగా దేవుడు శక్తినివ్వాలని, తాను మనసారా కోరుకుంటున్నట్టు చెప్పారు కేటీఆర్. 

Tags:    
Advertisement

Similar News