రేవంత్ మోడీ అంటే భయమా.. బడ్జెట్‌పై స్పందించవేం - కేటీఆర్
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటివరకూ కేంద్ర బడ్జెట్‌పై పెద్దగా స్పందన రాలేదు. ఇదే విషయంపై కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి ప్రశ్నలు సంధించారు.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం మధ్యంతరం బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకే కాదు దక్షిణాది రాష్ట్రాలకు పెద్దగా కేటాయింపులు జరగలేదు. తెలంగాణకు కేటాయింపులు లేకపోవడంపై బీఆర్ఎస్ బీజేపీపై విమర్శలు గుప్పించింది. తెలంగాణకు కేంద్ర బడ్జెట్‌లో దక్కింది గుండు సున్నా మాత్రమేనంటూ కొన్ని చోట్ల భారీ ఫ్లెక్సీలు కూడా పెట్టింది.
అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటివరకూ కేంద్ర బడ్జెట్‌పై పెద్దగా స్పందన రాలేదు. ఇదే విషయంపై కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి ప్రశ్నలు సంధించారు. తెలంగాణ సీఎం నుంచి బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా రాలేదని ట్వీట్ చేశారు కేటీఆర్. కాంగ్రెస్ నేతలు ఉద్దేశపూర్వక చెవిటితనాన్ని ప్రదర్శిస్తున్నారంటూ సెటైర్ వేశారు.
సీఎం రేవంత్ రెడ్డి దేనికి భయపడుతున్నారో చెప్పాలన్నారు కేటీఆర్. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి.. కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు లొంగిపోయారని విమర్శించారు. KRMBకి రాష్ట్ర ప్రజలను అప్పగించినా పూర్తిగా మౌనంగా ఉండడం నిజంగా భయంకరమైనదన్నారు కేటీఆర్.