జాబితా ప్రకటనలో ఆలస్యమెందుకు..? టీజీపీఎస్సీ చైర్మన్ కు కేటీఆర్ ఫోన్

ఏఈఈ పరీక్ష రాసిన విద్యార్థులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కేటీఆర్. వారి ముందే టీజీపీఎస్సీ చైర్మన్ కి ఫోన్ చేసి మాట్లాడారు.

Advertisement
Update: 2024-07-03 07:36 GMT

ఉద్యోగాలకు ఎంపికైన అసిస్టెంట్ సివిల్ ఇంజనీర్ల జాబితాను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని కోరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎగ్జామ్ ఫలితాలు వచ్చి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తైన తర్వాత తుది జాబితా ప్రకటించేందుకు ఇంత ఆలస్యమెందుకని ఆయన ప్రశ్నించారు. ఈమేరకు ఆయన టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెంటనే ప్రకటించాలని కోరారు కేటీఆర్.


గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏఈఈ(సివిల్) పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. 1180 పోస్ట్ లకు సంబంధించి పరీక్ష నిర్వహించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. గతేడాది సెప్టెంబర్ లోనే సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేశారు అధికారులు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తుదిజాబితా ప్రకటించడం ఆలస్యమైంది. ఈ విషయంపై పరీక్ష రాసిన విద్యార్థులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదు. చివరకు వారంతా కేటీఆర్ సాయం కోరారు. తమకు అండగా నిలబడాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ కేటీఆర్ ను కలిసి విన్నవించారు.

కేటీఆర్ భరోసా..

ఏఈఈ పరీక్ష రాసిన విద్యార్థులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కేటీఆర్. వారి ముందే టీజీపీఎస్సీ చైర్మన్ కి ఫోన్ చేసి మాట్లాడారాయన. తుది జాబితా ప్రకటనలో ఎందుకు ఆలస్యం అని ప్రశ్నించారు. ఇప్పటికే అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో ఉన్నారని, వెంటనే జాబితా విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. 

Tags:    
Advertisement

Similar News