మొగులయ్యకు అండగా కేటీఆర్

ఈరోజు ఉదయం మొగులయ్యను కేటీఆర్ స్వయంగా కలిశారు. ఆయనకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తామని చెప్పారు.

Advertisement
Update:2024-05-05 11:31 IST

పాలమూరు కళాకారుడు, కిన్నెర వాయిద్య వాగ్గేయకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఈరోజు ఉదయం మొగులయ్యను కేటీఆర్ స్వయంగా కలిశారు. ఆయనకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తామని చెప్పారు.


అసలేం జరిగింది..?

కిన్నెర వాయిద్య క‌ళాకారుడు మొగులయ్యకు 2022లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. అనంతరం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మొగులయ్యను సత్కరించింది. అప్పటి సీఎం కేసీఆర్ మొగులయ్యకు కోటి రూపాయల రివార్డు, హైదరాబాద్‌లో ఇంటి స్థలం ప్రకటించారు. నెలకు రూ.10 వేల గౌరవ వేతనం కూడా ఇస్తామన్నారు. అయితే ప్రభుత్వం అందించిన డబ్బులతో పిల్లల పెళ్లిళ్లు చేసిన మొగులయ్యకు మళ్లీ ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.10 వేల గౌరవ వేతనం కూడా ఆగిపోయింది. దీంతో ఆయన భవన నిర్మాణ కార్మికుడిగా కూలీ పనులకు వెళ్తున్నారు. ఈ విషయం మీడియాలో వైరల్ అయింది. దీంత మొగులయ్య ఆర్థిక కష్టాలు అందరికీ తెలిశాయి.

మీడియా ద్వారా మొగులయ్య కష్టాలు తెలుసుకున్న కేటీఆర్.. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ట్విట్టర్ ద్వారా ఆ విషయాన్ని తెలియజేశారు. ఆ తర్వాత నేరుగా కేటీఆర్ మొగులయ్యను కలిశారు. ఆయనకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

Tags:    
Advertisement

Similar News