ఫ్లిప్‌కార్ట్ ఫుల్ ఫిల్‌మెంట్ సెంటర్ ను ప్రారంభించిన కేటీఆర్
ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 వేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తే దేశం అదే ఫాలో అవుతుందన్నారు కేటీఆర్.
ఈ-కామర్స్ రంగం వేగంగా దూసుకుపోతోందని, ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 వేల మందికి ఉపాధి లభిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో మంగళవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో సంగారెడ్డిలో ఫ్లిప్‌కార్ట్ ఫుల్ ఫిల్‌మెంట్ సెంటర్‌ను కేటీఆర్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సంగారెడ్డిలో ఫ్లిప్ కార్ట్ ఫుల్ ఫీల్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు ఆ యాజమాన్యానికి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 వేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తే.. దేశం అదే ఫాలో అవుతుందన్నారు కేటీఆర్. దేశానికి తెలంగాణను రోల్ మోడల్‌గా మారుద్దాం అని కేటీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.