కేసీఆర్ తర్వాత సీఎం అయ్యే ఏకైక నాయకుడు కేటీఆరే
కేవలం కేసీఆర్‌కు కుమారుడైనందుకే కాదని.. కేటీఆర్‌కు ఉన్న నాలెడ్జ్ పరంగా, పాలనపై ఆయనకున్న అవగాహనపరంగా ఆయన సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నంత కాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. కేంద్రంలో కీలక పాత్ర పోషించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన కేంద్ర రాజకీయాలకు వెళ్తే ముఖ్యమంత్రిగా కేటీఆరే బాధ్యతలు స్వీకరిస్తారని వివరించారు. కేసీఆర్ తర్వాత టీఆర్‌ఎస్‌లో ముఖ్యమంత్రి అయ్యే ఏకైక నాయకుడు కేటీఆర్ మాత్రమేనన్నారు.
కేవలం కేసీఆర్‌కు కుమారుడైనందుకే కాదని.. కేటీఆర్‌కు ఉన్న నాలెడ్జ్ పరంగా, పాలనపై ఆయనకున్న అవగాహనపరంగా ఆయన సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. కేటీఆర్ ఉన్నది ఉన్నట్టే చెబుతారని.. మాయ మాటలు చెప్పడం, మోసాలు చేయడం ఆయనకు తెలియదన్నారు. మునుగోడు ఎన్నికల్లో ఓటమి భయంలోనే ఈసీని అడ్డుపెట్టుకుని బీజేపీ కుట్రలు చేస్తోందని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అందులో భాగంగానే కారు గుర్తును పోలి ఉన్న గుర్తులను ఇస్తున్నారని మండిపడ్డారు.