కేటీఆర్ చెల్లి రచన.. ఈ అనుబంధం మీకు తెలుసా?

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. రచనను అనే అమ్మాయిని చదివించడమే కాకుండా.. ఆమెను జీవితంలో స్థిరపడేలా చేశారు.

Advertisement
Update:2022-09-19 06:00 IST

కేటీఆర్ చెల్లి రచన ఏంటి.? కవిత కదా అని అందరికీ డౌటనుమానం రావచ్చు. కానీ రచన మాత్రం మా అన్న కేటీఆర్ అని చెబుతోంది. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఆ స్టోరీ తెలుసుకోవాలనుకుంటే ముందుగా రచన గురించి మనం తెలుసుకోవాలి.

రచన.. చాలా చురుకైన అమ్మాయి. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామానికి చెందిన రుద్ర రచన చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి స్థానిక బాలసదనంలో ఉంటూ ప్రభుత్వ బాలికల హైస్కూల్లో 10వ తరగతి వరకు చదివింది. తర్వాత హైదరాబాద్ యూసుఫ్‌గూడాలోని స్టేట్ హోమ్ లో ఉంటూ పాలిటెక్నిక్‌ని పూర్తి చేసింది.ఈ-సెట్ ప్రవేశ పరీక్ష ద్వారా హైదరాబాద్ CBIT కాలేజీలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ లో ఇంజనీరింగ్ సీటు సంపాదించింది.

హైదరాబాద్‌లోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించిన రచనకు.. ఆ కాలేజీ ఫీజు చెల్లించడం భారంగా మారింది. కానీ చదువుపై ఆసక్తి ఉన్న రచన ఇకపై చదవలేనేమో అని బాధపడింది. రచన ఇకపై చదవదు అని సన్నిహితులు, బంధువులు కూడా అనుకున్నారు. అయితే రచన టాలెంట్‌ను నగరంలోని ప్రముఖ కాలేజీలు గుర్తించినా.. ఫీజులు చెల్లించే స్థోమత మాత్రం లేకపోయింది.

రుద్ర రచన ఆర్ధిక ఇబ్బందులను సామాజిక మాధ్యమాల ద్వారా 2019లో తెలుసుకున్న కేటీఆర్, ఆమెను ప్రగతి భవన్ పిలిపించుకొని ఇంజినీరింగ్ చదువు పూర్తి అయ్యేందుకు అవసరమైన ఖర్చులను భరిస్తానని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రుద్ర రచన ఇంజనీరింగ్ ఫీజులు మరియు హాస్టల్ సంబంధిత ఖర్చులను కేటీఆర్ వ్యక్తిగతంగా భరించారు.

కేటీఆర్ ఇచ్చిన భరోసా, భరించిన ఫీజులతో రచన ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని.. కాలేజ్ ప్లేస్‌మెంట్‌ను సాధించింది. నాలుగు ప్రముఖ ఎంఎన్‌సీలలో ఉద్యోగ అవకాశాలు రావడంతో తాను అన్న అని నమ్మిన కేటీఆర్ దగ్గరకు వెళ్లాలని భావించింది. అంత కంటే ముందే రుద్ర రచనకు జాబ్ వచ్చిన విషయం తెలుసుకున్న కేటీఆర్.. ఇవ్వాళ ప్రగతి భవన్‌లో ఆమెను కలిశారు.

ఓ అన్నగా అండగా ఉంటానని మాటిచ్చిన కేటీఆర్.. ఇన్నాళ్లు తోడున్నందుకు రచన భావోద్వేగానికి గురయ్యారు. కేటీఆర్ అన్న కాలికి గాయం అయ్యిందన్న విషయం తనకు తెలియదని.. కేవలం నేను వస్తున్నా అని చెప్పగానే రిసీవ్ చేసుకున్నారని రచన చెప్పింది. గాయం అయ్యిందన్న విషయం తెలిస్తే నేను తర్వాత వచ్చి కేటీఆర్ అన్నను కలిసేదాన్ని అని రచన తన మనసులో మాట చెప్పింది. అయితే, ఇన్నాళ్లు తాను దాచుకున్న డబ్బులతో కొన్న వెండి రాఖీని కేటీఆర్ అన్నకు కట్టడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను లాస్ట్ ఇయర్ చదువుతున్నానని.. అందుకు అవసరమైన ఫీజులు అన్నీ కేటీఆర్ అన్న ఇచ్చేశారని ఆనందంగా రచన చెప్పింది.

Tags:    
Advertisement

Similar News