బాసర IIIT అధికారులపై కేటీఆర్ ఆగ్రహం!

కేటీఆర్, వీసీ వెంకట రమణ, పలువురు అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో తాను వచ్చినప్పుడు మెస్ కాంట్రాక్టర్ ను మార్చాలని చెప్పినా ఎందుకు మార్చలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''త్రిబుల్ ఐటీ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు. చెప్పిన పనులు కూడా ఎందుకు జరగడంలేదు'' అని కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు.

Advertisement
Update:2022-12-10 11:58 IST

బాసర త్రిబుల్ ఐటీ అధికారులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన హామీలెందుకు అమలు జరగలేదని మండిపడ్డారు. ఫుడ్ పాయిజనింగ్ అయి విద్యార్థులు అనారోగ్యాలపాలవుతుంటే మెస్ కాంట్రాక్ట్రర్ ను ఎందుకు మార్చలేదంటూ ప్రశ్నించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం ఏమైనా అంతరిక్ష సమస్యా అని నిలదీశారు.

బాసర త్రిబుల్ ఐటీ స్నాతకోత్సవం సందర్భంగా ఈ రోజు కేటీఆర్ తో పాటు మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క‌సుమన్ త్రిబిల్ ఐటీని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రులు విద్యార్థులకు ల్యాప్ టాప్ లు, డెస్క్ ట్యాప్ లు, బూట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు అక్కడి పరిస్థితులను కేటీఆర్ దృష్టికి తీసుక వచ్చారు.

ఈ సందర్భంగా కేటీఆర్ వీసీ వెంకట రమణ, పలువురు అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో తాను వచ్చినప్పుడు మెస్ కాంట్రాక్టర్ ను మార్చాలని చెప్పినా ఎందుకు మార్చలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''త్రిబుల్ ఐటీ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు. చెప్పిన పనులు కూడా ఎందుకు జరగడంలేదు'' అని కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. 

Tags:    
Advertisement

Similar News