రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలకు పంటలు దెబ్బతింటున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు సీఎం రేవంత్‌కు రెడ్డి ప్రశ్నలు సంధిస్తూ ట్వీట్ చేశారు. రైతులంటే చిన్నచూపు ఎందుకంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు కేటీఆర్. నిన్నటి వరకు పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని.. ఇవాళ వడగండ్ల వానకు పంటల దెబ్బతీసినా పట్టించుకోలేదన్నారు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప.. గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా..? అన్నదాతల ఆర్థనాదాలు వినిపించవా..? అంటూ ట్వీట్ చేశారు.
ఎన్నికల గోల తప్ప.. రైతులపై కనికరం లేదా అంటూ సీఎంను ప్రశ్నించారు. సీట్ల, ఓట్ల పంచాయితీ తప్ప.. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా..? అంటూ ప్రశ్నలు సంధించారు కేటీఆర్. ప్రజా పాలన అంటే.. 24/7 ఫక్తు రాజకీయమేనా.. పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి.. పంటనష్టంపై లేదెందుకని అడిగారు కేటీఆర్. దెబ్బతిన్న పంటలను పరిశీలించే తీరిక లేదా అన్నారు. ఈ ట్వీట్‌కు అనుబంధంగా పంట నష్టపోయి కన్నీరు పెట్టుకున్న ఓ రైతు వీడియోను పోస్టు చేశారు కేటీఆర్
కేటీఆర్ ట్వీట్ పూర్తి ట్వీట్ ఇదే
ముఖ్యమంత్రి గారు..
రైతులంటే.. మీకు ఎందుకింత చిన్నచూపు..?
నిన్న.. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు..
నేడు.. వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటంలేదు..
ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప..
గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా...?
అన్నదాతల ఆర్థనాదాలు వినిపించవా..??
ఎన్నికల గోల తప్ప..
ఎన్నో కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదా..?
సీట్లు.. ఓట్ల.. పంచాయతీ తప్ప..
అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా..??
ప్రజా పాలన అంటే.. 24/7 ఫక్తు రాజకీయమేనా..?
పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి.. పంటనష్టంపై లేదెందుకు ??
పాడైపోయిన పంటలను పరిశీలించే తీరిక లేదా ?
హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొట్టీ కొట్టీ..
రైతుల సమస్యలు వినే ఓపిక లేదా ?
ఇంతకాలం..
పచ్చని పైర్లు ఎండుతున్నా.. సాగునీరు ఇవ్వడం చేతకాలేదు..!
ఇప్పుడు..
నష్టపోయిన పంటలకు.. పరిహారం ఇవ్వాలన్న మనసు రావడం లేదా..?
గుర్తు పెట్టుకోండి..!!
ఎద్దేడ్సిన ఎవుసం..! రైతేడ్సిన “రాజ్యం బాగుండదు ..” !!
అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై..
భారత “రైతు” సమితి.. పోరాడుతూనే ఉంటది..!!!
జై కిసాన్
జై తెలంగాణ