రాహుల్‌, ప్రియాంక క్షమాపణ చెప్పాలి- కేటీఆర్

పీవీ మనందరం అభిమానించే వ్యక్తి. తన జీవితమంతా కాంగ్రెస్‌ కోసం సేవ చేసిన మానవతామూర్తి. కానీ, ఆయన్ని కాంగ్రెస్‌ పార్టీ దారుణంగా అవమానించింది.

Advertisement
Update:2023-11-25 18:10 IST

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి చరిత్రపై కనీస అవగాహన లేదని విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు కాంగ్రెస్‌ పార్టీ చాలా అన్యాయం చేసిందన్నారు. ఆయన్ని తీవ్రంగా అవమానించారన్నారు. "చరిత్రపై ప్రియాంకగాంధీకి కనీస అవగాహన లేకపోవడం నిజంగా దురదృష్టకరం. పీవీ మనందరం అభిమానించే వ్యక్తి. తన జీవితమంతా కాంగ్రెస్‌ కోసం సేవ చేసిన మానవతామూర్తి. కానీ, ఆయన్ని కాంగ్రెస్‌ పార్టీ దారుణంగా అవమానించింది".

"1996లో సిట్టింగ్‌ ప్రధానిగా ఉన్న పీవీ నర్సింహారావుకు ఎంపీ టిక్కెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఘోరంగా అవమానించింది. పీవీ చనిపోయినప్పుడు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలోకి భౌతిక కాయాన్ని కూడా అనుమతించలేదు. ఈ చరిత్ర గురించి ప్రియాంకాగాంధీకి అవగాహన లేకపోవడం దారుణం. పార్టీకోసం అంతలా పాటు పడ్డ పీవీకి కాంగ్రెస్‌ ఏం చేసింది. ఇప్పటికైనా పీవీ కుటుంబానికి రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ క్షమాపణ చెప్పాలి". పీవీని భారతరత్నతో సత్కరించాలి అని డిమాండ్ చేశారు కేటీఆర్.

Tags:    
Advertisement

Similar News